India / Crime
బెంగుళూరులో మరో దారుణం
282 days ago

బెంగళూరులో దారుణం వెలుగులోకి వచ్చింది. కేజీహళ్లి, కమ్మనహళ్లి ఘటనలు మరువకముందే మరో కామాంధుడు రెచ్చిపోయాడు. ఇద్దరు బాలికలతోపాటు ఓ మహిళను నిర్మాణుష్యమైన ప్రదేశానికి తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించి దొరికిపోయాడు. వయ్యాలి కావల్‌ ఏరియాలోని స్విమ్మింగ్‌పూల్‌ లేఔట్‌లో మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఓ మహిళ ఇంటికి వెళ్తోంది. మణికంఠ అనే యువకుడు ఆమెని అడ్డుకుని లైంగికంగా వేధింపులకు యత్నించాడు.

ఈ ఘటన జరిగినరోజు సాయంత్రం నాలుగున్నర గంటల టైంలో సదరు యువకుడు వయ్యాలికావల్‌ ఐదో రోడ్డులో స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్న ఇద్దరు బాలికలను బలవంతంగా ఓ ప్రదేశానికి తీసుకెళ్లి  లైంగిక దాడికి యత్నించాడు. బాలికలు ఎలాగోలా తప్పించుకుని పోలీసులు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అరెస్ట్‌ చేశారు. 22 ఏళ్ల మణికంఠ ఇంటర్ ఫినిష్ చేసి రియల్ ఎస్టేట్ సెక్టార్‌లో కూలీగా పనిచేస్తున్నాడు. 

 

Read Also

 
Related News
JournalistDiary