AP and TS / Entertainment
భేతాళుడు రివ్యూ
81 days ago

సినిమాపేరు : భేతాళుడు

విడుదల తేదీ : డిసెంబర్ 1, 2016

దర్శకత్వం : ప్రదీప్ కృష్ణమూర్తి

నిర్మాత : ఫాతిమా విజయ్ ఆంటోనీ

సంగీతం : విజయ్ ఆంటోని

నటీనటులు : విజయ్ ఆంటోని, అరుంధతినాయర్

 

సూపర్ హిట్ మూవీ ‘బిచ్చగాడు’లో హీరోగా నటించిన విజయ్ ఆంటోనీ ఇప్పుడు భేతాళుడంటూ సిల్వర్ స్ర్కీన్ మీదకొచ్చారు. రిలీజ్ కు ముందే 15నిమిషాల పార్ట్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేసి, తన సినిమా గురించి సవాల్ విసిరాడు డైరెక్టర్ ప్రదీప్ కృష్ణమూర్తి. మూవీ యూనిట్ కు ఇంత నమ్మకాన్ని ఇచ్చిన ఈ మూవీమీద ప్రేక్షకుల రియాక్షన్ ఎలా ఉండబోతోందో చూద్దాం.. 

కథ: దినేష్(విజయ్ ఆంటోనీ) తెలివైన ఓ పెద్ద సాఫ్ట్ వేర్ ఇంజనీర్. అయితే, ఉన్నట్టుండి డీలా పడిపోతాడు. తనను ఎవరో వెంటాడుతున్నారని ఆందోళన చెందుతుంటాడు. ట్రీట్మెంట్ కోసం డాక్టర్ని కలవగా..  గత జన్మ తాలూకు జ్ఞాపకాలతో దినేష్ బాధపడుతున్నాడని నిర్ధారిస్తాడు. కట్ చేస్తే.. దినేష్..  తన గత జన్మకు సంబంధించిన జయలక్ష్మి అనే మహిళను వెతుక్కుంటూ వెళ్లే క్రమంలో అనేక కష్టాలు ఎదుర్కొంటాడు. అసలు జయలక్ష్మి ఎవరు? గతజన్మ తాలూకూ సంగతులేంటి? దీని నుంచి దినేష్ ఎలా బయటపడ్డాడనేది స్క్రీన్ మీదే చూడాలి. 

విశ్లేషణ: 15 నిమిషాల సినిమా ఫ్రీగా చూపించి రెస్టాఫ్ ద మూవీపై అంచానాలుపెంచాడు డైరెక్టర్ ప్రదీప్. అయితే, సినిమా చూసిన ప్రేక్షకుడు మాత్రం అందుకే 15 నిమిషాల ఫ్రీ గా రిలీజ్ చేశాడంటూ సెటైర్లు విసురుతున్నారు. ఫస్ట్ హాఫ్ బిగి తగ్గకుండా బాగానే నడిపినప్పటికీ సెకండాఫ్ తేలిపోయిందంటున్నారు. హీరో మానసిక సమస్యను ఎలివేట్ చేసే సన్నివేశాలు..చాలా సున్నితంగానే తెరకెక్కించినప్పటికీ, అక్కడక్కడా హర్రర్ సినిమానా అనిపిస్తుంది. హీరో తన గత జన్మలోని జయలక్ష్మిని వెతుక్కుంటూ వెళ్లే సీన్స్.. గతజన్మ స్టోరీ.. ఇలా.. ఇంటర్వెల్ బ్యాంగ్ వరకూ స్క్రీన్ ప్లే ఆసక్తికరంగా సాగుతుంది.

 సెకండాఫ్ లో సీన్స్ హఠాత్తుగా మారిపోతుండటం.. పూర్తిగా ఒక మోడ్ లో ఉన్న ప్రేక్షకుడిని ఉన్నట్టుండి వేరే మోడ్ లోకి తీసుకెళ్లిపోవడం ఇబ్బందిగా కనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లు అంత ఇంట్రెస్టింగ్ అనిపించవు. సాంకేతిక విభాగంలో విజయ్ ఆంటోనీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, జయలక్ష్మి అనే బ్యాక్ గ్రౌండ్ వాయిస్ ఓవర్ కనెక్టవుతాయి. ప్రదీప్ కళైపురయత్ సినిమాటోగ్రఫీ ఓకే. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. క్లుప్తంగా చెప్పాలంటే,  హర్రర్ మూవీలా అనిపించే ఒక సైకలాజికల్ థ్రిల్లర్ ఇది. 

 

 
 
 
Related News

JournalistDiary