India / Politics
శశికళకు వెంకయ్య ఎర్త్?
70 days ago

జయలలిత మరణంతో తమిళనాడు మీద కేంద్రం భారీగానే ఆశలు పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. ఎఐఎడిఎంకె పార్టీని రెండుగా చీల్చి తమిళనాట చక్రం తిప్పాలన్న యోచన బిజెపి పెద్దలు చేస్తున్నట్టుగా ఉంది. అందులో భాగంగానే తమిళనాడు సిఎం పన్నీరు సెల్వం - ఎఐఎడిఎంకె ప్రధానకార్యదర్శి శశికళకు మధ్య చిచ్చుపెట్టి లబ్ధిపొందాలని పావులు కదుపుతోందన్న ఊహాగానాలు చెలరేగుతున్నాయి.

 తాజాగా కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు చేసిన వ్యాఖ్యలు ఈ ఊహాగానాలకు బలం చేకూర్చేలా కనిపిస్తున్నాయి. తమిళనాట తాము బలపడతామని చెబుతూనే.. రాజ్యాంగబద్ధంగా సీఎం గా ఎన్నికైన పన్నీరు సెల్వానికి తాము అండగా ఉంటామని వెంకయ్య ప్రకటించడం పన్నీర్ సెల్వం-శశికళ మధ్య చిచ్చురాజేయడమే అంటున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఇటీవల ఎంపికైన శశికళ సిఎం కుర్చీనెక్కేందుకు సన్నాహాలు చేస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో వెంకయ్య వ్యాఖ్యలు ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. 

 

 
 
 
Related News

JournalistDiary