India / Politics
ఫేస్‌బుక్‌ పోస్టుల వివాదంలో మాజీ చీఫ్‌ సెక్రటరీ
62 days ago

ఎపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫేస్‌బుక్‌లో పోస్టులు పెట్టారు మాజీ చీఫ్‌ సెక్రటరీ ఐవైఆర్‌ కృష్ణారావు. వైసీపీకి చెందిన వెబ్‌సైట్లలో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉన్న పోస్టులను తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌లోకి షేర్‌ చేశారాయన. దీంతో కృష్ణారావుపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. రిటైర్‌ కాగానే బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి అప్పగించినందుకు విశ్వాసం లేకుండా కృష్ణారావు వ్యవహరిస్తున్నారంటూ ఫేస్‌బుక్‌లో విరుచుకుపడుతున్నారు తెలుగు తమ్ముళ్లు. బాబు పాలన ప్రజల కష్టాలు, బాబుకి కులపిచ్చి ఉందంటూ సదరు వెబ్‌సైట్‌లో వచ్చిన పోస్టులను షేర్‌ చేసి కృష్ణారావు ఫేస్‌బుక్‌ పోస్టుల వివాదంలో చిక్కుకున్నారు. కాగా, టీడీపీ నేతల వ్యాఖ్యలపై ఐవైఆర్ స్పందించారు.  ఫేస్‌బుక్‌లో పోస్టులపై సరైన సమయంలో స్పందిస్తానన్నారు.

 
 
Related News