India / Crime
ప్రామిస్ చేసి భార్యని పార్క్‌కి పిలిచాడు.. ఆ తర్వాత
11 days ago

ప్రామిస్ చేసి భార్యని పార్క్‌కు రమ్మని పిలిచాడు... తన భర్త ఏదో సర్‌ప్రైజ్ చేస్తాడని భావించింది ఆ ఇల్లాలు. భార్యాభర్తలు కాసేపు కబుర్లు చెప్పుకున్నారు. ప్రేమగా భార్యని దగ్గరకు పిలిచి ఆశ్చర్యపరచబోతున్నానని చెప్పి కళ్లు మూసుకోవాలని అన్నాడు. దాంతో తన భర్త ఏదో గిఫ్ట్‌గానీ, తమ మధ్య విబేధాలకు ఫుల్‌స్టాప్ పెడతాడని సంతోషపడింది. ఆమె అలా కళ్లు మూసుకుందో లేదో వెంటనే ఓ వైరుని మెడకి గట్టిగా బిగించి చంపేశాడు.

ఉత్తర ఢిల్లీలో వుంటోంది మనోజ్‌‌కుమార్‌ ఫ్యామిలీ. రెండేళ్ల కిందట కోమల్ అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ, రెండేళ్లలో ఈ దంపతుల మధ్య విభేదాలు తలెత్తాయి. కోమల్‌కు వివాహేతర సంబంధం ఉందని మనోజ్‌ అనుమానించడం మొదలుపెట్టాడు. ఈ విషయంపై ఇద్దరి మధ్య తరుచు గొడవలు జరగడంతో కొంతకాలం విడివిడిగా ఉంటున్నారు. రోజురోజుకూ మెంటల్ టార్చర్ తట్టుకోలేని మనోజ్, భార్యని చంపాలని స్కెచ్ వేసుకున్నాడు. గొడవకు ముగింపు పలుకుదామని చెప్పి యూనివర్సిటీకి దగ్గరగావున్న బోంటా‌పార్క్‌ రమ్మని కోమల్‌ని పిలిచాడు. అందుకు ఓకే చెప్పిన కోమల్, అక్కడికి వచ్చింది..

కాసేపు భార్యాభర్తలు మాట్లాడుకున్నారు. భార్యని కళ్లు మూసుకోవాలని చెప్పి తనతో తెచ్చిన వైరుతో గొంతుకు బిగించి హత్యచేశాడు. ఆ తర్వాత మద్యం తాగుతూ జరిగిన సంగతిని ఫ్రెండ్స్‌కి వివరించాడు. ఈలోగా అటువైపు పెట్రోలింగ్‌కు వచ్చిన పోలీసులు అతడ్ని అనుమానించి ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. ఆ పార్క్‌లో కోమల్ మృతదేహాన్ని గుర్తించేందుకు పోలీసులకు దాదాపు ఆరుగంటలు పట్టింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.

 

 
 
 
Related News

JournalistDiary