India / Entertainment
‘ధృవ’ మూవీ రివ్యూ
316 days ago

‘బ్రూస్ లీ’తో బాక్సాఫీస్ వద్ద బోల్తాపడిన రామ్‌చరణ్, ఈసారి మాత్రం ధృవతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చాడు. తమిళంలో హిట్టయిన ‘తనిఒరువన్‌’కి రీమేక్ ఇది. చెర్రీ పక్కన మరోసారి రకుల్ ఆడి పాడింది. గీతాఆర్ట్స్ బ్యానర్‌ తెరకెక్కించిన ఈ చిత్రానికి డైరెక్టర్ సురేందర్‌రెడ్డి. మరి చరణ్.. ఆడియన్స్‌ని ఆకట్టుకున్నాడా? లేదా అన్నది రివ్యూలో చూద్దాం. 

  స్టోరీ

దేశానికి మంచి చేయాలనే ఆలోచనతో ఐపీఎస్‌కి సెలక్ట్ అవుతాడు ధృవ(రామ్చరణ్). ఓవైపు ట్రైనింగ్ తీసుకుంటూ మరోవైపు తనలాంటి ఆలోచనలతోవున్న నలుగురు వ్యక్తులతో జతకడతాడు హీరో. తన టీంతో కలిసి రాత్రివేళ జరుగుతున్న నేరాలపై ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. హైదరాబాద్‌ సిటీలో జరిగే నేరాల వెనుక ముగ్గురు సభ్యుల ముఠా వుందని తేలుతుంది. దీని వెనుక అసలు పెద్ద తలకాయను పట్టుకోవాలని స్కెచ్ వేస్తాడు. అతడ్నే తన టార్గెట్‌గా ఫిక్స్ చేసుకోవాలను కుంటాడు. సీన్ కట్ చేస్తే... రాజకీయం అండతో సొసైటీలో సైంటిస్ట్‌గా, ఫార్మా బిజినెస్‌మేన్‌గా చెలామణి అవుతాడు సిద్దార్థ్ అభిమన్యు (అరవింద్ స్వామి). పేదల ప్రాణాలను కాపాడటం కోసం అతి తక్కువ రేటుకే మందులను అందించే అగ్రిమెంట్ను అడ్డుకొని దేశాన్ని తన చెప్పు చేతల్లోకి తెచ్చుకోవాలనుకుంటాడు స్వామి. ఈవిషయం తెలుసుకుంటాడు ధృవ. దీంతో ధృవ- అభిమన్యు ఎత్తుకు పైఎత్తులు వేస్తూవుంటారు. ఈ నేపథ్యంలో సిద్దార్ధ్‌ని ఎలా అడ్డు కుంటాడు? ఇంతకీ అభిమన్యు బ్లాక్‌డ్రాప్ ఏంటి? రకుల్‌కి చెర్రీకి రిలేషన్ ఏంటి? అన్నది తెరపై చూడాలి. 

విశ్లేషణ... 

తమిళంలో హిట్టయిన ‘తని ఒరువన్‌’కి రిమేక్ ఇది. చెర్రీ గతంలో సిన్సియర్ పోలీస్ అధికారి రోల్ చేసినప్పటికీ, ఇప్పుడున్న రోల్ కాసింత ఆగ్రహంతో ప్రత్యర్థుల ఎత్తుకుపైఎత్తులు వేస్తూ అందులో ఒదిగిపోయాడు. సిక్స్ ప్యాక్‌బాడీతో ఆకట్టుకున్నాడు. దీంతో తన స్థాయిని ప్రూవ్ చేసుకున్నాడు చరణ్. తెలివైన శత్రువుతో ఫైట్ చేసేటప్పుడు ఎదురయ్యే మానసిక సంఘర్షణను అద్భుతంగా చూపించాడు. ఆ క్రెడిట్ అంతా డైరెక్టర్ సురేందర్‌రెడ్డికే దక్కుతుంది. హీరోకి విలన్గా అరవింద్ స్వామి సూపర్బ్. ఆయన కాకుండా మరొకరిని ఇందులో ఊహించుకోలేం. విలన్ అంటే కాసింత స్టయిలిష్‌గా ఎలా వుండాలో చూపించాడు.

ఒకవిధంగా చెప్పాలంటే స్వామి ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. రకుల్‌కు ఇందులో పెద్దగా స్టోరీ ఏమీలేదు. గ్లామర్ కోసమే ఆమెకి తీసుకున్నట్లు వుంది. ఇతర పాత్రల్లో నవదీప్, పోసాని కృష్ణమురళీ, నాజర్ తమ పరిధి మేరా ఆకట్టుకున్నారు. మూవీకి మరో ఎట్రాక్షన్ స్ర్కీన్ ప్లే. యాక్షన్ సీన్స్‌తో‌పాటు సాంగ్స్‌ని రిచ్‌గా చూపించాడు. ఇది రీమేక్ సినిమా అన్న విషయాన్ని మరిచిపోయేలా చేశాడు డైరెక్టర్. సినిమాటోగ్రఫీ బాగుంది.. ఐపీఎస్‌లు ట్రైనింగ్‌లో తీసిన సీన్స్, సాంగ్స్ విషయంలో వర్క్ చాలా బాగుంది. సింపుల్‌గా సాంగ్స్ పెద్దగా ఎట్రాక్ట్ చేసుకోలేదు.. అలాగే సినిమాని సాగదీసినట్టు కనిపిస్తోంది. ఎడిటర్ కత్తెరలు వేస్తే బాగుండేది.. తమిళంలో చూడని ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది.

 

 

 

 

 

 

Read Also

 
Related News
JournalistDiary