India / Entertainment
ఈడు గోల్డ్ ఎహే మూవీ రివ్యూ
379 days ago

సినిమా పేరు: 'ఈడు గోల్డ్ ఎహే' 

రిలీజ్ డేట్: 07-10-2016 

రచన, దర్శకత్వం: వీరూ పోట్ల 

నిర్మాత‌: సుంక‌ర రామ‌బ్రహ్మం 

సంగీతం: సాగ‌ర్ మ‌హ‌తి 

న‌టీన‌టులు: సునీల్‌..  సుష్మారాజ్‌.. రిచా ప‌న‌య్‌.. పృథ్వీ.. జ‌య‌సుధ‌.. న‌రేష్‌.. పోసాని కృష్ణమురళి.. పునీత్ ఇస్సార్‌.. వెన్నెల కిషోర్‌.. ప్రభాస్ శ్రీను..

ఫస్ట్ మూవీ హిట్ ఇచ్చినప్పటికీ తర్వాత చేసిన సినిమాలేవీ కమెడియన్ టర్న్ హీరో సునీల్ కు అనుకున్నంత సక్సెస్ ఇవ్వలేకపోయాయి. ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలని శతవిథాలా ప్రయత్నిస్తోన్న సునీల్ కు చివరిగా చేసిన జక్కన్న కూడా నిరాశపరచడంతో తన ఫ్రెండ్ వీరు పోట్లమీద ఆశలు పెట్టుకుని ఈడు గోల్డ్ ఎహె తీశాడు. 'బిందాస్', 'దూసుకెళ్తా' వంటి సక్సెస్ మూవీస్ అందించిన వీరూ పోట్ల సునీల్ ఆశలు నిలబెట్టాడోలేదో చూద్దాం..

   

కథ: ఎవరూ లేని అనాధ బంగార్రాజు(సునీల్). ఎక్కడ పనికి కుదిరినా ఆ యజమానికి నష్టంవాటిల్లుతుంటుంది. ఈ పరిస్థితుల్లో ఉద్యోగం కోల్పోయి హైదరాబాద్ కు పయనమవుతాడు బంగార్రాజు. అయితే, హైదరాబాద్ లో బంగార్రాజు విచిత్రపరిస్థితులు ఎదుర్కొంటాడు. తనకు తెలీని వాళ్లు సైతం వచ్చి సునీల్ వర్మ అని పలకరిస్తూ ఉంటారు. అయితే, ఓ కుటుంబంతో బంగార్రాజుకు మంచి అనుబంధం ఏర్పడుతుంది. ఇంటావిడ జయసుధ బంగార్రాజును పెద్దకొడుకులా భావిస్తుంది. ఆమె కొడుకుని బంగార్రాజు సొంత తమ్ముడిలా చూసుకుంటాడు. ఈ క్రమంలో విగ్రహాల స్మగ్లర్ మహదేవ్ బంగార్రాజు తమ్ముడ్ని కిడ్నాప్ చేస్తాడు. తాను సునీల్ వర్మని కాదని చెప్పినా వినకుండా అయితే, అసలైన సునీల్ వర్మ ఎవరో తెచ్చి తనకు అప్పజెప్పి తమ్ముడ్ని విడిపించుకోవాలని షరతు పెడతాడు. ఇంతకీ సునీల్ వర్మ ఎవరు? బంగార్రాజే సునీల్ వర్మగా మారతాడా? జయసుధ ఫ్యామిలీకి బంగార్రాజుకీ ఏర్పడ్డ అనుభంధానికి కారణమేంటి? తదితర విషయాలు తెరపైన చూడాల్సిందే..    

 

విశ్లేషణ : తన మార్కు మూవీలాగే 'ఈడు గోల్డ్ ఎహే' తెరకెక్కించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ వీరుపోట్ల. ఫస్టాఫ్ భరించాం సెకండాఫ్ అయినా బాగుంటుందేమో అని ఆశించిన ప్రేక్షకులకు నిరాశే మిగిల్చింది. రానురాను కథనంలో స్పీడు తగ్గిపోయి చప్పగా సాగుతుంది సినిమా. ఆధ్యంతం కామెడీ పండించాలని ట్రైచేసిన వీరు, సీరియస్ విషయంలో సైతం కామెడీ చొప్పించడం పెద్దగా వర్కౌట్ కాలేదు. ప్రాస‌ల‌తో పేల్చే డైలాగులు ఆకట్టుకుంటాయి. సునీల్ డ్యాన్స్ లకోసం సినిమాకి వెళ్లేవాళ్లకి కొంత నిరాశే ఎదురవుతుంది. హీరో సునీల్ అమాయ‌కుడిగా..  క్లైమాక్స్‌లో యాంగ్రీ యంగ్ మెన్ గా మెప్పించినప్పటికీ, హీరోయిన్లు సుష్మారాజ్, రిచా పనాయ్ లకు విషయం ఉన్న పాత్రలు లభించలేదు. ష‌క‌ల‌క శంక‌ర‌, న‌రేష్‌, వెన్నెల కిషోర్ కామెడీ ఓకే. జ‌య‌సుధ‌, విల‌న్‌గా పునీత్ ఇస్సార్ కీలకరోల్స్ పోషించారు. కథలో సెంటిమెంట్, సునీల్ పంచ్ డైలాగ్స్ సినిమాకి ప్లస్ పాయింట్స్ కాగా, సాంగ్స్, కథలో కొత్తదనం లేకపోవడం ఈడు గోల్డ్ ఎహే కు డ్రాబ్యాక్స్ గా నిలుస్తాయి. 

చివ‌రిమాట: ఈడు డౌటెహే!   

 

Read Also

 
Related News
JournalistDiary