AP and TS / Entertainment
‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’‌ మూవీ రివ్యూ
337 days ago

స్వామిరారా, కార్తీకేయ, సూర్య వర్సెస్ సూర్య లాంటి డిఫరెంట్ స్టోరీలతో ప్రేక్షకుల ముందుకొచ్చే హీరో నిఖిల్, మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ‘శంకరాభరణం’తో నిరాశపరిచినా ఈసారి కొత్త కాన్సెప్ట్‌తో వచ్చాడు. రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’‌ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఆనంద్ డైరెక్ట్ చేసిన ఈ ఫిల్మ్‌ నిఖిల్‌ని ఫాంలోకి తీసుకొచ్చిందా? లేదా అన్నది తెలియాలంటే రివ్యూలోకి వెళ్దాం... 

స్టోరీ...

అర్జున్ (నిఖిల్) చదువు తర్వాత యానిమేషన్ ట్రూప్‌లో చేరుతాడు. హీరో ఫ్రెండ్‌కి సోద‌రుడు కిశోర్ (వెన్నెల కిశోర్‌)‌కి దెయ్యం ప‌ట్టిన‌ట్టు అనుమానం వస్తుంది. అందులోనుంచి బ‌య‌ట‌ప‌డ‌టానికి అత‌డ్ని కేర‌ళ‌లోని ఓ టెంపుల్‌కి వెళ్లమంటాడు ఓ స్వామీజీ. దీనిప్రకారం అర్జున్- కిశోర్ ఇద్దరూ అక్కడికి వెళ్తారు. ఇంతవరకు స్టోరీ బాగానే వుంది. చివరకు కిశోర్‌కి దెయ్యం ప‌ట్టలేద‌ని తేలుతుంది. అక్కడే అర్జున్‌కి అమ‌ల (హెబ్బా ప‌టేల్‌)తో రిలేషన్ ఏర్పడుతుంది. ఓ నాలుగు రోజులు ఇద్దరూ సరదగా గ‌డుపుతారు. అంతలోనే ఆమె క‌నిపించ‌కుండా పోతుంది. ఓసారి క‌నిపించినా త‌న పేరు అమ‌ల కాదు నిత్య అని చెబుతుంది. ఇంతకీ అమ‌ల ఎవ‌రు? నిఖిల్ చదువుతున్నప్పుడే అవికా గోర్‌ని ప్రేమిస్తాడు.. మ్యారేజ్ చేసుకోవాలని రిజిస్ర్టార్ ఆఫీసు కూడా వెళ్తారు. సీన్ కట్ చేస్తే... అర్జున్ ప్రేమించిన ఆయేషా (అవికా గోర్‌) ఏమ‌యింది? అమ‌ల‌- ఆయేషాకి మధ్య సంబంధం ఏంటి? ఆల‌యంలో జ‌రిగింది ఏంటి? ఒక వ్యక్తి బ‌తికుండగానే అత‌నిలో మ‌రో ఆత్మ ప్రవేశించ‌డం సాధ్యమేనా? వంటి అంశాలు తెరపై చూడాలి. 

విశ్లేషణ...

వెరైటీ స్టోరీలను ఎంచుకొని బాక్సాఫీసు వద్ద సక్సెస్ సాధిస్తున్నాడు హీరో నిఖిల్. ఈసారి అలాంటి ప్రయోగం చేశాడు. ఓ వైపు కాలేజ్ స్టూడెంట్,  మరోవైపు కెరీర్లో సెటిలయిన వ్యక్తిగా రెండు‌ లుక్స్లో మంచి వేరియేషన్ చూపించాడు. నటుడిగా మరో మెట్టు ఎక్కాడు.. పెర్ఫార్మెన్స్ బావుంది. హెబ్బాపటేల్ అల్లరిపిల్లగా కనిపించింది. ప‌గ సాధించుకునే దెయ్యం రోల్‌లో మరో హీరోయిన్ నందిత శ్వేత ఇమిడిపోయింది. తొలిసారిగా టాలీవుడ్‌కి పరిచయమైన నందితా మంచి నటన కనబరిచింది. హారర్ సన్నివేశాల్లో ఆమె నటన సూపర్బ్. అవికాఘోర్ పాత్ర సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్. తెర మీద కనిపించేది కొద్దిసేపయినా తనదైన నటనతో మెప్పించింది అవికా. ఇతర పాత్రల్లో వెన్నెల కిశోర్, ప్రవీణ్, తనికెళ్ల భరణి ఆకట్టుకున్నారు. సినిమాకు మరో మేజర్ హైలెట్ సినిమాటోగ్రఫీ. మహిషాసుర మర్థనీ ఆలయం, ఫస్టాఫ్లో వచ్చే సాంగ్స్, విజువల్ చాలా బాగున్నాయి. ఎడిటింగ్ ఓకే.. ‘టైగర్’ తో డైరెక్టర్‌గా మారిన విఐ ఆనంద్, రెండోసారి బాగానే ఆకట్టుకున్నాడు. సక్సెస్ ఫార్ములాగా మారిన కామెడీ హర్రర్ జానర్నే నమ్ముకున్నా రొటీన్ సినిమా అన్న ఫీలింగ్ లేకుండా చేశాడు. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో నడిపించాడు. ప్రతి సీన్ విషయంలోనూ ఆనంద్ తీసుకున్నాడు. మైనస్‌లూ లేకపోలేదు. స్వార్థం ఉన్న చోట ప్రేమ ఉండ‌దు అనే డైలాగ్ ఉంటుంది. కానీ హీరోతో క‌లిసి ఉండాల‌నే స్వార్థంతో అత‌డి ప్రేయ‌సి ప‌ర‌కాయ‌ ప్రవేశం చేయ‌డం ఏంటో అర్థం కాదు. త‌మిళ‌నాడులోని రాశిపురానికి చెందిన అమ్మాయికి తెలుగు ఎలా వ‌స్తుందో మింగుడుప‌డ‌దు. మొత్తానికి డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన కామెడీ హారర్ థ్రిల్లర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.  

 

Read Also

 
Related News
JournalistDiary