AP / crime
ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో ప్రమాదం.. ప్రయాణికుల బెంబేలు!
1335 days ago

ఏపీ నుంచి ఢిల్లీ బయల్దేరిన ఏపీ ఎక్స్‌ప్రెస్ రైల్లో ఉన్నట్లుండి పొగలు వ్యాపించడం ప్రయాణికులను హడలెత్తించింది. ఉత్తరప్రదేశ్‌లోని మధుర స్టేషన్ సమీపిస్తుండగా బీ1 బోగీలో అకస్మాత్తుగా పొగలు వెలువడ్డాయి. ఏం జరిగిందో అర్ధం కానీ ప్రయాణికులు పక్కవైపునున్న బోగీల్లోకి పరుగులు తీశారు. మొదట అగ్ని ప్రమాదం సంభవించింది అనుకున్నారంతా. ప్రయాణికులు ఒక్కసారిగా పరుగులు పెట్టడంతో బోగీలో తొక్కిసలాట చోటుచేసుకుంది.

ఈ తొక్కిసలాటలో కొంత మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో మాల మహానాడు అధ్యక్షుడు కారెం శివాజీ కూడా వున్నారు. మధుర చేరుకోవడంతోనే రైలుని నిలిపివేసిన అధికారులు పరిస్థితిని సమీక్షించారు. రైలుకి మరమత్తులు చేసి ఏ ప్రమాదం లేదని నిర్ధారించుకున్న తర్వాత రైలు ఢిల్లీకి బయల్దేరింది. ప్రమాదం ఏమీ లేదని తెలుసుకున్న ప్రయాణికులు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు.

 

 
 
 
Related News
JournalistDiary