AP and TS / Entertainment
దేశం మీసం తిప్పబోతోందా?
283 days ago

సంక్రాంతికి బరిలోకి దిగిన పందెంకోళ్లలో ఓ కోడి.. ఖైదీ నెం150 ఫలితం తేలిపోయింది. దీంతో ఇక జనవరి 12వతేదీన బరిలోకి దిగబోతోన్న మరో పందెంకోడి గౌతమిపుత్రశాతకర్ణి మీద హడావుడి మొదలైంది. ఖైదీ ఇచ్చిన ఫలితం బాలయ్య సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. చారిత్రక నేపథ్యం..బాలయ్య నట విశ్వరూపం.. క్రిష్ స్టామినా మీద ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ చేస్తున్న హంగామా అంతాఇంతాకాదు. అటు టాలీవుడ్ సినీ ప్రముఖులనుంచి కూడా ప్రశంసలు, శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

బాలయ్య, డైరెక్టర్ క్రిష్ తో పాటు ఈ మూవీ టీం కు శుభాకాంక్షలు చెప్పిన అక్కినేని నాగార్జున.. హిస్టారికల్స్ చూడ్డం తనకు ఎంతో ఇష్టమని వ్యాఖ్యానించాడు.  అంతేకాదు, ఈ సినిమా మరో చరిత్రను క్రియేట్ చేస్తుందని కూడా వ్యాఖ్యానించారు. అటు ఓవర్సీస్ లో దేశం మీసం తిప్పబోతోందంటూ హంగామా మొదలైపోయింది. ఇక బాలయ్య టీం మొత్తం బ్రమరాంభ థియేటర్లో రేపు తెల్లవారుజామున 4గంటలకు వేసే షోలో సినిమా చూడనున్నారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో బాలయ్య ఫ్యాన్స్ థియేటర్ల దగ్గర సందడిని కూడా షురూ చేశారు.    

 

Read Also

 
Related News
JournalistDiary