AP / Entertainment
చంద్రబాబు గెస్ట్ అప్పియరెన్స్
131 days ago

బావ కళ్లలో ఆనందం చూడటానికి బాలకృష్ణ బెజవాడ ఫ్లైటెక్కాడు. తన వందో సినిమా విజయోత్సాహంలోవున్న బాలయ్య, ఏపీ సీఎం చంద్రబాబు కోసం విజయవాడలో స్పెషల్‌ షో ప్లాన్ చేశారు. బెంజ్ సర్కిల్‌లోని ట్రెండ్‌సెట్ మాల్‌లో గురువారం సాయంత్రం 7 గంటలకు శాతకర్ణి ప్రదర్శన జరుగుతుంది.

చంద్రబాబుతోపాటు ఆయన ఫ్యామిలీ‌మెంబర్స్ కూడా అటెండ్ కానున్నారు. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీడీపీ నేతలు కూడా బాబుతో కలిసి శాతకర్ణి మూవీ చూడనున్నారు. వియ్యంకుడికి వెల్‌కమ్ చెప్పడం కోసం బాలకృష్ణ హైదరాబాద్ నుంచి విజయవాడ బయలుదేరివెళ్లారు. 

 

 
 
 
Related News
JournalistDiary