AP and TS / Entertainment
శాతకర్ణికి మెగా ఫ్యామిలీ దాసోహం...
282 days ago

బాలకృష్ణ నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాని మెగా ఫ్యామిలీ ఓ రేంజ్‌కి ఎత్తేసింది. దీనిపై మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు.  గౌతమీపుత్ర శాతకర్ణి గురించి అన్ని ఏరియాల నుంచి రిపోర్ట్స్ అందుతున్నాయని, ఈ సందర్భంగా యూనిట్, డైరెక్టర్ క్రిష్‌కి కంగ్రాట్స్ చెప్పాడు ఈ హీరో. బాలకృష్ణ తమతోపాటు చాలామందికి స్ఫూర్తిగా నిలిచారని చెబుతూ శాతకర్ణి పిక్‌ని పెట్టి మరీ హర్షం వ్యక్తంచేయడం గమనార్హం. శాతకర్ణి గురించి మెగా ఫ్యామిలీ నుంచి ట్వీట్ రావడం ఇదే ఫస్ట్‌టైమ్ అని చెబుతున్నారు.

ఒక్కసారి వెనక్కివెళ్తే... శాతకర్ణి ఫిల్మ్ ప్రారంభోత్సంలో చిరంజీవి చెప్పిన ఓ విషయాన్ని మరోసారి గుర్తు చేస్తున్నారు. బాలకృష్ణ వందో మూవీ ఒకటైతే, రెండోది క్రిష్‌ డైరెక్ట్ చేయడం, మూడోది రాజుల కాలం స్టోరీ ఎంచుకోవడంతో సగానికి సగం సక్సెస్ అయినట్టేనని చిరంజీవి మాటల్ని ప్రస్తావిస్తున్నారు. రీసెంట్‌గా ఖైదీ గురించి బాలయ్య కూడా అదే విధంగా స్పందించాడు. హీరోల మధ్య పోటీ అంటూ ఏమీలేదని, సంక్రాంతి సందర్భంగా అభిమానులకు పసందైన విందు లభించడమే తమ ఉద్దేశమంటూ చెప్పిన విషయం తెల్సిందే! 

 

Read Also

 
Related News
JournalistDiary