AP and TS / Entertainment
నన్ను డైరెక్షన్ మానేయమంది
919 days ago

రచయిత, నటుడు, దర్శకనిర్మాత ఇలా పరిశ్రమలో బహుళ పాత్రలు పోషించిన పోసాని కృష్ణమురళి సాధారణంగా రీల్ లైఫ్‌లోనైనా.. రియల్ లైఫ్‌లోనైనా అందరిమీదా సెటైర్లేస్తుంటాడు. 'రాజా.. రాజా ..' అంటూనే ఎక్కడ గిల్లాలో అక్కడ గిల్లుతాడు. ఆయన నోట్లో వేలు పెడితే కష్టమేరా బాబూ అనేది పోసానిపై వున్న కామెంట్. అటువంటి పోసానినే చూసి హీరోయిన్ అనుష్క పక్కున నవ్విందట. 'ఇకపై నువ్వు డైరెక్షన్ చేయడం మానేసి సినిమాల్లో నటించడం బెటర్' అని చెప్పిందట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకున్నాడు. 

'వేదం' షూటింగ్ జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరిగిందంటున్నాడు. ఇదే సినిమాలో నటిస్తున్న పోసాని ఓ రోజుసెట్‌లో సరదాగా డైరెక్టింగ్ చేస్తూ కనిపించాడట. ఆయన డైరెక్టింగ్ స్కిల్స్ చూసిన అనుష్క నవ్వాపుకోలేక పోయిందట. అదేంటో కానీ అంతకుముందు వరుసపెట్టి ఆరు సినిమాలు డైరెక్ట్ చేసిన పోసాని ఆ తర్వాత 'దుశ్శాసన' అని ఒక్క సినిమాతోనే సరిపెట్టుకున్నాడు. పోసాని డైరెక్ట్ చేసిన పొలిటికల్ సైటిరిక్ ఫిలిం 'ఆపరేషన్ దుర్యోధన' ఆయనకి మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. 

 

 
 
 
Related News

JournalistDiary