India / Entertainment
హిందూపురంలో బాలయ్య ఫాన్స్ వీరావేశం..!
283 days ago

సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకురానున్న మూవీ గౌతమిపుత్ర శాతకర్ణి. బాలకృష్ణ- శ్రేయ జంటగా గురువారం రాబోతోంది ఈ ఫిల్మ్. దీంతో నందమూరి అభిమానుల హంగామాకి హద్దులేకుండా పోయింది. బాలకృష్ణ ఎమ్మెల్యేగా గెలిచిన హిందూపురంలోని ఓ థియేటర్‌ని బాలయ్య అభిమానులు ఇలా కటౌట్లతో అలంకరించారు. ఒకవిధంగా చెప్పాలంటే ఆ కటౌట్లతో థియేటర్‌కి కల వచ్చేసింది..నిండుగా కనిపించింది. ఇక నెల్లూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో అయితే ఫ్యాన్స్ భారీ ఎత్తున ర్యాలీ చేపట్టారు. తమ అభిమాన హీరో బాలయ్య మూవీ సక్సెస్ కావాలని ర్యాలీ చేపట్టారు. 

 

Read Also

 
Related News
JournalistDiary