Telangana / Politics
ఆయన వచ్చాకే కేటాయింపులు
675 days ago

డీఎల్ఎఫ్ భూముల వ్యవహారంలో టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గలేదు. ఈ భూముల కేటాయింపులన్నీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాకే జరిగాయని ఆయన అన్నారు. కానీ, సీఎం సభను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. అసలు డీఎల్ఎఫ్ గురించి ప్రజల్లోకి తీసుకెళ్లింది తానేనని, ఆ ఆరోపణలు నిజమని తేలాయని అన్నారు.

అయినా ఆరోపణలు చేసిన తనకు సభలో చర్చకు అవకాశం ఇవ్వలేదని ఆయన విమర్శించారు. వాస్తవాలు బయటికి వస్తాయనే టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారని తెలిపారు. భూ కేటాయింపు వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి రూ.250 కోట్లకు పైగా నష్టం జరిగిందని రేవంత్ రెడ్డి వివరించారు.అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఆయన.. ఈ సమస్యపై ప్రభుత్వం తన నోరు నొక్కేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

 
 
 
Related News

Jyo achyutanand 308X300 banner