India / Entertainment
ఇజం రివ్యూ
365 days ago

టెంపర్ మూవీ తరవాత   పూరీజగన్నాధ్ చాలెంజ్ గా తీసుకుని చేసిన మూవీ ఇజం ఇవాళ రిలీజ్ అయింది. అది థియేటర్ల దగ్గర ఏమేరకు సక్సెస్ సాధించిందో రివ్యూ లో చూడండి..

కథ .వెరయిటీ స్టోరీలతో. . హీరోను రొటీన్ కు భిన్నంగా ఎలివేట్ చేసే డైరెక్టర్  పూరీ జగన్నాథ్. జరిగిన సంఘటనల ఆధారంగా సినిమాలుతీయడంలో ముందుండే వర్మ తరహాలోనే ఈ సారి పూరీ  జగన్నాథ్ ఇజం తీసాడు. ఆ మధ్య కాలంలో సంచలనం సృష్టించిన వికిలీక్స్‌ ఎపిసోడ్‌ని సబ్జెక్ట్ గా   దాని చుట్టూ కథనం అల్లాడు పూరీ.ఆ పార్టీ ,ఈ పార్టీ అని లేకుండా .. దేశంలో అనేకమంది అవినీతిపరులు, వైట్ కాలర్డ్ క్రిమినల్స్, బిజినెస్ పీపుల్,  చేస్తున్న నేరాలను  బయట పెట్టే ఓ పవర్‌ఫుల్ జర్నలిస్ట్ (కళ్యాణ్ రామ్). ఆ జర్నలిస్ట్ ఎవరు? ఆ మార్గాన్నే ఎందుకు ఎంచుకున్నాడు?  అతని  ప్రేమ కథేంటి? అన్నదే ఇజం సినిమా.

పాత్రల  తీరుతెన్నులు..

ఒక విధంగా చెప్పాలంటే ..  కళ్యాణ్ రామ్‌కి ఇది ఓ  స్పెషల్ సినిమా.జర్నలిస్ట్‌గా కనిపించేందుకు  అతను చేసిన ప్రతి కష్టం కూడా సినిమాకు హెల్ప్ అయింది.  సిక్స్ ప్యాక్ ఒక్కటే కాదు..ఓవరాల్ గా  బాడీ లాంగ్వేజ్‌ని కూడా మార్చుకున్నాడు. డైలాగ్ డెలివరీ విషయంలో కూడా వేరియేషన్  చూపించే ప్రయత్నం చేశాడు రామ్. హీరోయిన్ కూడా ఓకె. ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ కోసం ముందుగా ప్రకాష్ రాజ్‌ని అనుకున్నా చివరి క్షణంలో జగపతిబాబుని ఫైనల్ చేశాడు. తనికెళ్ళ భరణి, గొల్లపూడి మారుతీరావుల యాక్టింగ్ బాగుండటమే కాదు.. వాళ్ళ నటన రామ్ మూవీకి  ప్లస్ పాయింట్  అయింది. కళ్యాణ్ రామ్, అదితి ఆర్య, జగపతిబాబు,తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు. టెక్నికల్ విషయానికొస్తే ఫొటోగ్రఫీ, ఎడిటింగ్ బాగుండటంతో  సినిమాకు  ప్లస్ అయ్యాయి. అనూప్ రూబెన్స్ సాంగ్స్‌ కంపోజింగ్ ,  బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగున్నాయి. ఇక పూరీ జగన్నాథ్  సొంత గా రాసుకున్న కథ, కథనం బాగానే  ఉన్నాయి. డైలాగ్స్‌  ఓకే.

డ్రా బ్యాక్స్..

తన కొత్త సినిమాలను కూడా పాత పద్ధతిలో తీస్తుండటం వల్ల కొత్తదనం మిస్ అయిన ఫీలింగ్. కొన్ని సీన్లు మరీ సిల్లీగా ఉండి సినిమా వెయిట్ ను తగ్గించాయి. రొటీన్  క్యారెక్టరైజేషన్,.రొటీన్ సీస్స్ నుంచి పూరీ బయట పడితే..అతనినుంచి మంచి సినిమాలు వచ్చే అవకాశం ఉందనేది సినీజనాల ఫీలింగ్.. కానీ  ఇజం సినిమాతో మాత్రం కాస్త కొత్తగా ట్రై చేశాడు పూరీ.. క్లైమాక్స్‌లో బ్రిటీషువాళ్ళు దోచుకోవడం , స్వాతంత్ర్యం వచ్చాక మనవాళ్ళు దోపిడీని  పోలుస్తూ రాసిన డైలాగ్స్‌కు మంచి రెస్పాన్సే వచ్చింది. థియేటర్‌లో విజిల్స్ మోత మోగింది. టోటల్ గా పూరీ కష్టం తెరమీద కనిపించిందనే కామెంట్స  వినిపిస్తున్నాయి.

 

Read Also

 
Related News
JournalistDiary