AP and TS / Entertainment
‘ఇడియట్స్‌’తో శ్వేతా ఐటంసాంగ్
12:38 PM on 21st September, 2014

ఇటీవలే వ్యభిచారం కేసులో పట్టుబడి ప్రస్తుతం రెస్క్యూహోమ్‌లో వుంటున్న నటి శ్వేతా బసు ప్రసాద్ ఈమధ్యే ఓ కొత్త సినిమాలో ఐటంసాంగ్ చేసింది. బాలాజీ అనే కొత్త దర్శకుడు డైరెక్ట్ చేసిన ఈ సినిమా టైటిల్ 'ఇంటెలీజెంట్ ఇడియట్స్'. శరద్ మిశ్రా, శ్రీహరి, శ్రీనివాసులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యూత్ ఓరియెంటెడ్ కాన్సెప్ట్‌తో వస్తున్న సినిమాల్లో ఇదీ ఒకటి. విక్రమ్ శేఖర్, ప్రభజీత్ కౌర్, సప్తగిరిలు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. 

తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ట్రయలర్ రిలీజైంది. ఆధునిక సైబర్ టెక్నాలజీని అడ్డం పెట్టుకుని నేటి యువత ఏమేం చేస్తోంది? ఎలా అడ్డదారులు తొక్కుతోందనే బ్యాక్‌డ్రాప్‌లో 'ఇంటెలీజెంట్ ఇడియట్స్' తెరకెక్కుతోంది. 

 
 
 
Related News