AP and TS / Entertainment
ఖైదీ ఫస్ట్ డే కలెక్షన్స్
282 days ago

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 బుధవారం గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. వసూళ్ల విషయంలో ఫస్ట్ డే కొన్ని ఏరియాల్లో బాహుబలి రికార్డులను బద్దలు కొట్టినట్టు వార్తలొచ్చాయి. ప్రీమియర్, బెనిఫిట్ షోలతో కలిసి 30 కోట్లు రాబట్టినట్టు  ఫిల్మ్ మేకర్స్ నుంచి అందుతున్న తాజా సమాచారం. ఒక్క అమెరికాలోనే ప్రీమియర్ షోల ద్వారా రూ. 8.56 కోట్లు వసూలు చేసినట్టు బాలీవుడ్ ట్రేడ్ ఎనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ ట్విట్టర్‌లో రాసుకొచ్చాడు. 

ఇక గల్ఫ్ విషయానికొస్తే..  దుబాయ్, ఒమన్, మస్కట్, కువైట్, సౌదీ అరేబియాలోనూ ముందుగానే టిక్కెట్లు అమ్ముడు పోవడంతో ఐదుకోట్లు రావచ్చుని ఓ అంచనా! ఇక తెలుగు రాష్ర్టాల్లో ఓవరాల్‌గా 15 కోట్లు వచ్చినట్టు ఇన్‌సైడ్ సమాచారం. సెకండ్ డే కూడా ఇదే స్పీడ్ కొనసాగడం కష్టమేనని అంటున్నారు. ఎందుకంటే బాలకృష్ణ శాతకర్ణి రావడంతో రెండోరోజు ఖైదీ వసూళ్లు తగ్గవచ్చని, వీకెండ్‌లో మళ్లీ పుంజుకున్నట్లయితే బయ్యర్లు ప్రాఫిట్‌ జోన్‌లోకి వచ్చే ఛాన్స్ వుంది. 

 

Read Also

 
Related News
JournalistDiary