AP and TS / Politics
వాట్సాప్‌లో ఖైదీ మూవీ..
104 days ago

చిరంజీవి 150వ సినిమాకి కూడా పైరసీ బెడద నుంచి తప్పించుకోలేకపోయింది. మూవీ రిలీజైన కొద్ది గంటల్లోనే రెండు పాటలు, 15 నిమిషాల నిడివిగల వీడియో సోషల్ మీడియాలో హంగామా చేస్తోంది. రామ్‌చరణ్‌తో  కలిసి చిరు చేసిన అరనిమిషం స్టెప్స్ ఇప్పటికే థియేటర్ బయట హల్‌చల్ చేస్తున్నాయి.

కాజల్- చిరంజీవి కాంబినేషన్‌లో ఓ పాట కూడా టికెట్ దొరకని అభిమానుల్ని అలరిస్తోంది. గతంలో అత్తారింటికి దారేది, కబాలి సినిమాలకూ ఇటువంటి దెబ్బే తగిలింది. ఐతే, దాని ప్రభావం సినిమా వసూళ్ల మీద పడిన దాఖలాలైతే లేవు. మరి ఖైదీ విషయంలో ఏం జరుగుతుందో? 

 

 
 
 
Related News

JournalistDiary