Telangana / General
కన్నీళ్లు పెట్టుకున్నాడు
894 days ago

కష్టాల్లో వున్న వారిని చూస్తే పవన్ కల్యాణ్ తట్టుకోలేరు. అత్తారింటికి దారేది ఆడియో ఫంక్షన్‌లో పవన్ గురించి చెబుతూ డైరెక్టర్ త్రివిక్రమ్ అన్న మాటలివి. అయితే, అది నిజమేనని నిరూపించుకున్నాడు పవన్. తాజాగా ఖమ్మంలోని హాస్పిటల్లో చావుబతుకుల మధ్య కొట్లాడుతూ తనని కలవాలని కోరిన శ్రీజాను చూసి పరామర్శించేందుకు ఖమ్మం వచ్చిన ఆయన.. హాస్పిటల్ బెడ్‌పై అచేతనంగా పడివున్న శ్రీజని చూసి చలించిపోయారు. శ్రీజా నిన్ను చూసేందుకు నేనే వచ్చాను అని ఆ చిన్నారితో మాట్లాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆమె నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో చిన్నారి చెవివద్ద 'శ్రీజా...శ్రీజా' అంటూ పిలిచాడు. అయినప్పటికీ ఆమెలో చలనం లేకపోవడం పవన్ కల్యాణ్‌ని తీవ్ర ఆవేదనకు గురిచేసింది. వెంటనే పవన్ కంట కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇంత చిన్న పిల్లకు ఇంత పెద్ద సమస్యా ? అంటూ చుట్టూ వున్న సన్నిహితులతో ఆవేదన వ్యక్తంచేశారు. 

శ్రీజ స్పందించని స్థితిలో ఇక హాస్పిటల్లో ఏం చేయాలో అర్థం కానీ పవన్ అక్కడి నుంచి బయటికి వస్తూ శ్రీజ పేరెంట్స్ కి రూ. 2 లక్షల చెక్కు, శ్రీజకి బహుమతిగా ఇవ్వాలని తెచ్చిన వినాయకుని ప్రతిమ, బొమ్మలు ఇచ్చేశాడు. కంగారు పడకండి.. చిన్నారికి ఏమీ కాదులే అని శ్రీజ పేరెంట్స్, బంధువులకి ధైర్యం చెప్పి అక్కడి నుంచి కదిలాడు. అయితే, తనను చూసి శ్రీజా ఎంతో సంతోషిస్తుందని భావిస్తూ అదే ఆశతో హాస్పిటల్‌కి వెళ్లిన ఆయన.. చివరకు ఓ రకమైన నిరాశతోనే వెనుదిరిగారు. అదే పవన్‌ని ఎంతగానో బాధించింది. 

 

 
 
 
Related News

JournalistDiary