India / General
చిన్నమ్మకు పెద్ద ఆపరేషన్
282 days ago

ఇమాన్ అహ్మద్.. 5000  కేజీల బరువుతో వరల్డ్ హెవీయెస్ట్ ఉమెన్‌గా చెబుతున్న ఆమె, వెయిట్ తగ్గించుకునేందుకు అవసరమైన సర్జరీ కోసం ముంబై వచ్చింది. అదుపు లేకుండా ఐదువందల కిలోలు పెరిగిపోయిన ఇయాన్‌కు ముంబైలో డాక్టర్లు బేరియాటిక్ సర్జరీ నిర్వహిస్తారు. ఈజిప్ట్‌లోని పోర్ట్ సిటీ ఆఫ్ అలెక్సాండ్రియిలో నివాసముంటున్న అహ్మద్ పదకొండో ఏట నుంచే అనారోగ్యానికి గురయ్యింది. హైపర్ టెన్షన్, సల్మనరీ డిజార్డర్, డయాబెటిస్, ఆస్థమా లాంటి వ్యాధులతో బాధపడుతుండేది. ఒకసారి అహ్మద్‌కు గుండెపోటు కూడా వచ్చింది. చదువుకోవాలని ఆసక్తి ఉన్నా, అనారోగ్య కారణాలతో చదువు మధ్యలోనే ఆపేయాల్సివచ్చింది.

 బేరియాటిక్ సర్జరీ ఎక్స్‌ఫర్ట్, ఫిలాంథ్రో ఫిస్ట్ డాక్టర్ ముఫ్ఫీ లక్డావాలా పిలుపు మేరకు ముంబై వచ్చింది. తొలుత ట్రీట్‌మెంట్ కోసం అహ్మద్‌కు అనుమతి రాకపోయినా, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ అభ్యర్థన మేరకు ఇయాన్‌కు సర్జరీకి అనుమతి లభించింది. ఇక్కడివరకు బాగానే ఉంది. ఐతే అహ్మద్‌ను కైరో ఎయిర్ పోర్ట్ నుంచి ముంబైకి తరలించడమే పెద్ద సమస్యగా మారింది. ఇందుకు ఏ విమన సంస్థ కూడా ముందుకు రాలేదు. కైరో నుంచి ముంబైకి డైరెక్ట్ ఫ్లైట్ కూడా లేకపోవడం మరో సమస్య అయింది. దీంతో ప్రైవేట్ ఛార్టెడ్ ఫ్లైట్‌ను ఎరేంజ్ చేశారు. దీంతో ముంబైలోని సైఫీ హాస్పిటల్ అహ్మద్ సర్జరీ‌కి రెడీ అయ్యింది. 

హాస్పిటల్‌లో ఒక రూం మొత్తాన్ని అహ్మద్ కోసం కేటాయించారు. ఆ గదిని స్పెషల్ ఆపరేషన్ థియేటర్‌లా మార్చేశారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్, నిత్యం డాక్టర్లు అందుబాటు లో ఉండేందుకు రెండు గదులు, సకల సదుపాయాలతోవున్న ఆపరేషన్ ధియేటర్ ఇలా అన్ని కలిపి సుమారు రెండు కోట్ల రూపాయలతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మళ్లీ దీనిలో ప్రత్యేకంగా అహ్మద్ సైజ్ బరువును బట్టి ప్రత్యేక డోర్లు,స్పెషల్ డాక్టర్ల టీం, ఒక బేరియాటిక్ సర్జన్, కార్డియాక్ ఎండి క్రైనాలజిస్ట్ ఎట్సెట్రా డాక్టర్లను ఆరునెలలపాటు అక్కడే ఉండేలా ఏర్పాట్లు చేశారు. అన్ని సదుపాయాలు కలిసొచ్చి అహ్మద్ బాడీ కనుక సర్జరీకి సహకరిస్తే ఈ నెలాఖరులోగా ట్రీట్‌మెంట్ చేస్తామంటున్నారు. 

 

Read Also

 
Related News
JournalistDiary