India / Politics
ఎన్డీఏ రాష్ర్టపతి అభ్యర్థిగా రామ్‌నాథ్
9 days ago

దేశ అత్యున్నత రాష్ట్రపతి పదవి ఎవరిని వరించ బోతోంది ? దీనిపై క్లారిటీ వచ్చేసింది. ఎన్డీఏ తమ అభ్యర్థిగా బీహార్ గవర్నర్‌గా పనిచేస్తున్న రామ్‌నాథ్ కోవింద్‌ని ఎంపిక చేసింది. ఈ మేరకు సోమవారం ఢిల్లీలో సమావేశమైన బీజేపీ పార్లమెంటరీబోర్డ్ నిర్ణయం తీసుకుంది. రామ్‌నాథ్ 12 ఏళ్ళు రాజ్యసభ సభ్యునిగా వ్యవహరించారు.

ఆయన ఈనెల 23న తన నామినేషన్‌ను దాఖలు చేయనున్నారు. ఇప్పటివరకు బీజేపీ సీనియర్ నేత ఎల్‌.కె అద్వానీని రాష్ర్టపతి అభ్యర్థిగా చేయవచ్చునని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఐతే తాజాగా బీజేపీ సీనియర్ నేతలు రామ్‌నాథ్‌ని ఎంపిక చేశారు. మోదీ ఈ శుక్రవారం అమెరికా పర్యటనకు బయల్దేరి వెళ్ళే ముందే రాష్ట్రపతి అభ్యర్థి ని ఖరారు చేయడం విశేషం. ఏకాభిప్రాయం సాధ్యమేనని భావిస్తున్నారు.. మోదీ.. పార్టీ సీనియర్ నేతలైన రాజ్ నాథ్ సింగ్, వెంకయ్య నాయుడు తదితరులతో చర్చలు జరిపారు. ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీ కాలం వచ్చేనెల 24 తో ముగియనుంది.

 

 

 
 
 
Related News

JournalistDiary