India / Entertainment
నాగభరణం మూవీ రివ్యూ
372 days ago

ఉమెన్ ఓరియంటెడ్ సినిమాలు చేయడంలో తనకు ఎదురులేదని నిరూపించుకున్నాడు డైరెక్టర్ కోడి రామకృష్ణ. ఆయన దర్శకత్వంలో శుక్రవారం తెలుగు, కన్నడ, తమిళంలో రిలీజైంది నాగభరణం. అమ్మోరు, దేవి, అరుంధతి లాంటి సినిమాలతో తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. దివంగత కన్నడ‌స్టార్ విష్ణువర్ధన్ను మరోసారి తెర మీద హీరోగా చూపిస్తూ, రమ్య కీలకమైన రోల్ చేసిన ఈ చిత్రం మాంచి హైప్ క్రియేట్ చేసింది. మరి ఓసారి రివ్యూలోకి...

 

స్టోరీ.. 

సూర్యగ్రహణం రోజున శక్తిని కోల్పోయే దేవతలు, ఆ సమయంలో దుష్టశక్తులను ఎదుర్కొనేందుకు తమ శక్తిని దారపోసి ఓ మహా కలశాన్ని సృష్టిస్తారు. శక్తి కవచాన్ని శివయ్య (సాయి కుమార్) వంశం ఏళ్ళుగా కాపాడుతుంది. ఈ క్రమంలో శివయ్య కూతురు నాగమ్మ (రమ్య) కవచాన్ని కాపాడే ప్రయత్నంలో తన ప్రాణాలు కోల్పోతుంది.. కవచాన్ని జారవిడుస్తుంది. వచ్చేజన్మలో కవచాన్ని ఎలాగైనా అదే ప్లేస్‌లో ప్రతిష్టించడానికి మానస (రమ్య)గా పుడుతుంది. ఈ నేపథ్యంలో ఆ శక్తి కవచాన్ని దక్కించుకునేందుకు రకరకాల పన్నాగాలు పన్నుతారు ప్రత్యర్థులు. ఇంతకీ ఆ కవచం ఎవరి చేతుల్లోకి వెళ్ళింది? దాని మహత్యం ఏంటి? మిగతా స్టోరీ తెరపై చూడాల్సిందే! 

విశ్లేషణ...

నాగభరణం.. దుష్టశక్తికి- దైవశక్తికి మధ్య నడిచే వార్. ఆ తరహా సినిమాలు ఇప్పటికే చాలా వచ్చాయి. స్టోరీ పాతదే అయినా, కాసింత ఆసక్తికరంగా తీస్తే బాగుండేది. ఈ మూవీలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది విజువల్ ఎఫెక్ట్స్‌. రమ్య నటన తిరుగులేదు. ఒకవిధంగా చెప్పాలంటే ఈ మూవీతో ఆమెకి ఇమేజ్ మరింత రెట్టింపు అవుతుంది. క్లైమాక్స్ పార్ట్‌లో దివంగత కన్నడ సూపర్‌స్టార్ విష్ణువర్ధన్‌ను విజువల్ ఎఫెక్ట్స్ సూపర్. ఒక నటుడిని గ్రాఫిక్స్‌ రూపంలో పునఃసృష్టించినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అందుకు ఈ చిత్రం ఎగ్జాంఫుల్.

ఇక ప్రతీ సన్నివేశం ప్రేక్షకుడి ఊహకు అనుకున్నట్లే సాగుతుంది. సాయికుమార్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు, ఓ యాక్షన్ సీన్ బాగున్నాయి. కపాలి రోల్‌లో వివేక్‌ ఓకే, ముకుల్‌దేవ్‌.. రవికాలేపై దృష్టిపెడితే బాగుండేది. మిగిలిన క్యారెక్టర్లు గురించి చెప్పుకోవాల్సిందేమీ లేదు. ఒక చిన్న పాయింట్ తప్పితే, బలమైన స్టోరీ లేకపోవడం ప్రధాన మైనస్. దాని చుట్టూ  ఆకట్టుకునే స్టోరీ లేకపోవడం. ఫస్టాఫ్‌లో ఎప్పుడు ఏ సన్నివేశం వస్తుందో తెలియదు. పోనీ సెకండాఫ్‍లోనూ సేమ్ సీన్ రిపీట్. 

విజువల్‌ ఎఫెక్ట్స్‌లో పామును క్రియేట్ చేసిన విధానం సూపర్. సినిమాటోగ్రఫీ ఓకే! ఎడిటర్ కత్తెరలు వేయాల్సింది.. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. కోడిరామ‌కృష్ణ చేసిన పాత సినిమాలను మిక్స్ చేసి నాగ‌భ‌ర‌ణం స్టోరీని త‌యారు చేసినట్టు క‌నిపించింది. ‘నాగభరణం’ విజువల్ ఎఫెక్ట్స్ తప్పితే చెప్పుకోవడానికి ఏమీలేదు. ఇంకా తన శక్తిని రామకృష్ణ పెంచాల్సివుంది. కేవలం గ్రాఫిక్స్‌తో ఆడియన్స్‌ని ఆకట్టుకోవడానికి పడిన తపన తప్ప, ఈ మూవీలో పెద్దగా ఎట్రాక్ట్ చేయడానికి తీసుకున్న జాగ్రత్తలేవీ లేవనే విమర్శలు కూడా వినబడ్డాయి. 

 

 

Read Also

 
Related News
JournalistDiary