India / Entertainment
టాలీవుడ్ సీనియర్‌ నటుడితో నమిత డేటింగ్!
9 days ago

బొద్దుగుమ్మ నమిత మళ్లీ వార్తల్లోకి వచ్చేసింది. సినిమాల మాట పక్కనబెడితే టాలీవుడ్‌కి చెందిన ఓ సీనియర్ నటుడితో ఈమె డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతో తెలీదుగానీ ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్‌లోనూ హాట్ టాపిక్.. ఆపై పెద్ద చర్చ. సీనియర్ నటుడు శరత్‌బాబుతో నమిత ప్రేమ వ్యవహారం నడుపుతోందని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.

ఇటీవలికాలంలో శరత్‌‌బాబు చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు బలం చేకూరుతోందని అంటున్నారు. తనకు రెండు పెళ్లిళ్లు పెటాకులైపోయాయని, ఇప్పుడు ఓ హీరోయిన్‌తో రిలేషన్‌షిప్ కొనసాగిస్తున్నానని ఆయన చెప్పినట్టు ప్రచారం సాగుతోంది. దీంతో ఆ హీరోయిన్ నమిత అని తమిళతంబీలు ఓ ఆలోచనకు వచ్చారు. ఈ వార్తలపై నటీనటులు ఏమంటారో? ఇండస్ర్టీలో ఇలాంటివి సహజమేనని సైలెంట్‌గా వుంటారో? లేదో చూడాలి.

 

Read Also

 
Related News
JournalistDiary