AP and TS / Entertainment
టీజర్‌లో ‘బిగ్‌బాస్’ అదరగొట్టేశాడు
125 days ago

ఎన్టీఆర్ నటిస్తున్న ‘బిగ్‌బాస్’ రియాల్టీ షో ప్రమోషన్ ఊపందుకుంది. జులై నుంచి మూడునెలల పాటు బుల్లితెరపై అభిమానులను కనువిందు చేయనుంది ఈ షో. దీనికి సంబంధించి 30 సెకన్ల నిడివిగల టీజర్‌ని యూనిట్ రిలీజ్ చేసింది. ఎన్టీఆర్‌‌కి ఇరువైపులా ఇద్దరు ఫారెన్ బ్యూటీలు నిలబడినట్టు ప్రొమోలో చూపించారు. వాళ్లు ఎవరన్నది ఎక్కడా క్లారిటీ లేదు. ఇక మ్యూజిక్ సూపర్ అంటూ కామెంట్స్ పడిపోతున్నాయి.

సినిమా మారిదిగానే ఈ ప్రొమోకి హిట్స్ రావడంతో యూనిట్ ఫుల్‌హ్యాపీ! ఈ కార్యక్రమాన్ని 45 కోట్ల బడ్జెట్‌తో స్టార్ మా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ప్రతీ శని, ఆదివారాల్లో రియాల్టీ షో ప్రసారం కానుంది. రెమ్యునరేషన్ విషయాని కొస్తే.. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’లో చిరంజీవికి ఇచ్చిన దానికంటే ఎన్టీఆర్ ఆల్‌మోస్ట్ రెట్టింపని చేసినట్టు ఇన్ సైడ్ సమాచారం.

 

Read Also

 
Related News
JournalistDiary