India / Politics
రజనీ ఎంట్రీపై మరింత క్లారిటీ
124 days ago

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై వున్న అనుమానాలు కొద్దికొద్దిగా చెదిరిపోతున్నాయి. సోదరుడు సత్యనారాయణ గైక్వాడ్ ఇప్పటికే రెండుసార్లు మీడియా ముందుకొచ్చి స్పష్టతనిచ్చినప్పటికీ.. కొన్ని వర్గాల నుంచి సందేహాలు వస్తుండడంతో రజనీ శిబిరం ప్రత్యక్ష చర్యలకు దిగినట్లు కనిపిస్తోంది. పోయస్ గార్డెన్లోని తన నివాసంలో వున్న
రజనీకాంత్.. రాజకీయ నేపథ్యమున్న కొంతమందికి అపాయింట్ మెంట్ ఇవ్వడం మొదలుపెట్టేశారు.

తాజాగా 'హిందూ మక్కల్ కచ్చి' అనే మతవాద పార్టీ ఒకటి రంగంలోకొచ్చింది. సదరు పార్టీ వ్యవస్థాపకుడు అర్జున్ సంపత్ రజనీకాంత్ తో భేటీ అయ్యి, దాదాపు గంటసేపు చర్శలు జరిపారు. రాజకీయాల్లోకి రావడానికి రజనీ సిద్ధంగా వున్నారని, ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారని సంపత్ చెప్పారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని, ఇప్పుడు గనుక నిశ్శబ్దంగా ఉండిపోతే తనను తమిళ ప్రజలు అనుమానించే ప్రమాదం ఉందని రజనీ తనలో అన్నట్లు సంపత్ చెప్పుకున్నారు. సొంత పార్టీ ఏర్పాటు కోసం కసరత్తు జరుగుతున్న విషయాన్ని కూడా తమతో పంచుకున్నారని హిందూ మక్కల్ కచ్చి నేత సంపత్ చెప్పారు. ఈ పరిణామం తర్వాత సూపర్ స్టార్ ఫ్యాన్స్ లోను, తమిళ రాజకీయాల్లోనూ మరింత సందడి నెలకొంది.

 

Read Also

 
Related News
JournalistDiary