AP and TS / Entertainment
‘ప్రేమమ్’ మూవీ రివ్యూ
379 days ago

లవర్ బాయ్ నాగచైతన్య హీరోగా నటించి రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘ప్రేమమ్’ శుక్రవారం తెలుగు రాష్ర్టాల్లో రిలీజైంది.  మలయాళంలో హిట్టయిన ప్రేమమ్‌కి ఇది రీమేక్. ఇందులో చైతన్య పక్కన శృతిహాసన్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లు. చందూ మొండేటి డైరెక్ట్ చేసిన ప్రేమమ్.. ప్రేక్షకులను ఆకట్టుకుందా? లేదా అనేది చూడాలంటే రివ్యూలోకి వెళ్దాం. 

స్టోరీ : హైస్కూల్‌లో చదువుతున్న విక్రమ్(నాగచైతన్య), అందమైన అమ్మాయి సుమ(అనుపమా పరమేశ్వరన్)ని లైక్ చేస్తాడు. అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి బాగానే కష్టపడతాడు. చివరకు ఓకే అవుతుందన్న సమయంలో విక్రమ్- సుమల లవ్ స్టోరీ అర్ధాంతరంగా ముగిసిపోతుంది. ఆ విషాదం నుంచి తేరుకునే సమయంలో ఏళ్లు గడిచిపోతాయి. సీన్ కట్ చేస్తే.. విక్రమ్ కాలేజ్లో జాయినవు తాడు. కాలేజీలో గ్యాంగ్‌ని క్రియేట్ చేసుకుని గొడవలు పడతాడు. ఆ కాలేజీలో లెక్చరర్గా సితార వెంకటేషన్(శృతిహాసన్) వస్తుంది. ఆమెతో మరోసారి లవ్‌లో పడతాడు విక్రమ్. చివరకు ఓల్డ్ స్టోరీ తరహాలోనే విక్రమ్‌‌ లవ్‌స్టోరీ ముగుస్తుంది. హైస్కూల్, కాలేజీ అయిపోయిన తర్వాత విక్రమ్ లైఫ్‌లో థర్డ్ స్టేజ్ మొదలవుతుంది. ఈసారి రెస్టారెంట్‌ని స్టార్ట్ చేసి లైఫ్లో సెటిలవుతాడు. మరోసారి విక్రమ్ లైఫ్‌లోకి సింధు(మడోనా సెబాస్టియన్) వచ్చింది. ఇంతకీ సింధు ఎవరు? దీనికి ముగింపు ఎలా? అన్నది తెరపై చూడాలి. 

విశ్లేషణ : లవ్‌లో గెలిస్తే అమ్మాయి మనతో ఉంటుంది.. ఓడితే ఆ జ్ఞాపకాలు మనతో ఉంటాయని చెప్పే ఓ అందమైన మూవీ ఇది. ఒక విధంగా చెప్పాలంటే 12 ఏళ్ల కిందట రవితేజ నటించిన ‘నా ఆటోగ్రాఫ్’ లాంటి మూవీ. యాక్టింగ్ పరంగా ఈ సినిమాతో 100శాతం మార్కులు సాధించాడు నాగచైతన్య. కెరీర్‌లో బెస్ట్ పర్ఫామెన్స్తో ఆకట్టుకున్నాడు. మూడు లవ్‌స్టోరీల్లో బాగా ఒదిగిపోయాడు. స్కూల్ ఏజ్, కాలేజ్ కుర్రాడిగా, లైఫ్‌లో సెటిల్ అయిన తరువాత వచ్చే మెచ్యూరిటీ లాంటి వేరియేషన్స్ను బాగా చూపించాడు డైరెక్టర్. మిగిలిన ఇద్దరు హీరోయిన్లతో పోలిస్తే శృతిహాసన్‌ ఎక్కువసేపు కనిపిస్తుంది. అనుపమ ఓన్ డబ్బింగ్ కాస్త ఇబ్బంది పెట్టినా, నటన పరంగా ఆకట్టుకుంది. మడోనా సెబాస్టియన్‌ తన పరిధి మేరకు నటించింది. ఇతర రోల్స్‌లో ప్రవీణ్, కృష్ణచైతన్య, శ్రీనివాస్ రెడ్డి, నోయల్, 30 ఇయర్స్ పృథ్విలు మెప్పించారు. ఇక మెగాస్టార్, నందమూరి హీరోల సినిమాల మాదిరిగానే.. విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జునల గెస్ట్ రోల్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి.  నాగార్జున వాయిస్‌ ఓవర్‌ కూడా సినిమాకి ప్లస్ పాయింట్. మరో ఎసెట్ మ్యూజిక్, కెమెరా వర్క్ బాగుంది. ‘ఎవరే’ పాట సూపర్బ్‌గా ఉంది. స్టోరీలో ఎక్కడా మలయాళ మూవీ అన్న ఫీలింగ్ రాకుండా తెలుగు నేటివిటికీ మార్పులు బాగున్నాయి. ఒకవిధంగా చెప్పాలంటే చందూ మొండేటి మంచి విజయం సాధించాడు. నిర్మాణం విలువలు కూడా బాగున్నాయి. దసరాకి స్టార్ హీరోల సినిమాలు లేకపోవడంతో ప్రేమమ్‌కి అదనపు అట్రాక్షన్. 

 

 

Read Also

 
Related News
JournalistDiary