AP / Entertainment
స్మార్ట్ ఫోన్ కొనండి.. సబ్సిడీ పట్టండి
14 days ago

స్మార్ట్‌ ఫోను కొనుగోలు చేసేవారికి రూ.1000 సబ్సిడీ ఇచ్చే అవకాశాలను పరిశీలిస్తున్నామని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుంటుందని చెప్పారు. ప్రతీ ఇంటికీ కుళాయి..పేదలందరికీ ఆహార భద్రత..రాష్ట్రమంతా చిట్టి గురువులు..గ్రామాభివృద్ధికి దాతలు స్పందించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా ద్వారపూడిలో జరిగిన జన్మభూమి గ్రామసభలో సీఎం పాల్గొని ప్రసంగించారు.

విజయనగరం జిల్లా ద్వారపూడిలో అమలు చేస్తున్న చిట్టి గురువులు (నిరక్ష్యరాస్యులైన తల్లిదండ్రులకు చదువు చెప్పే) కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని సీఎం ప్రకటించారు. పేదల కళ్లలో ఆనందం చూడటమే తన లక్ష్యమని, దాని కోసం భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతామన్నారు.  జన్మభూమి రుణం తీర్చుకొనేందుకు దాతలు ముందుకు రావాలని.. కార్పొరేట్‌ సోషల్‌ రెస్సాన్సిబిలిటీ కింద గ్రామాభివృద్ధికి దాతలు సహకరించాలని చంద్రబాబు కోరారు. 

 
 
 
Related News

JournalistDiary