India / Entertainment
‘కాలా’లో శివాజీ‌రావ్ గైక్వాడ్ రోల్ ఎవరు?
11 days ago

రజినీకాంత్ న్యూప్రాజెక్ట్ ‘కాలా’ గురించి లేటెస్ట్ న్యూస్. ఈ మూవీ టైటిల్ దగ్గర నుంచి ఇప్పుటివరకు ఎన్నో గాసిప్స్, మరెన్నో
వార్తలు. గ్లామర్ ఇండస్ర్టీకి రాక‌ముందు ర‌జినీకాంత్ అస‌లు పేరు శివాజీ రావ్ గైక్వాడ్. ఇప్పుడు ఈ పేరుని కాలా చిత్రంలో
వాడుకోనున్నారు. ఈ విష‌యాన్ని అఫీషియ‌ల్‌గా ప్రక‌టించారు కూడా!

అర‌వింద్ ఆకాశ్.. ‘కాలా’లో శివాజీ‌రావ్ గైక్వాడ్ అనే పేరుతో ఓ మ‌రాఠి పోలీస్ ఆఫీస‌ర్ రోల్ చేస్తున్నాడట. ఈ పాత్రకి, ర‌జినీ లైఫ్ స్టోరీకి అసలు సంబంధం ఉండ‌ద‌న్నది యూనిట్ మాట. మొత్తానికి కాలా గురించి ఏదోఒక క్లూ ఇస్తూ ప్రచారం మాత్రం ఓ రేంజ్‌లో చేసుకుంటున్నారనే వాదన కూడా బలంగా వినబడుతోంది. ప్రస్తుతం షూటింగ్ చెన్నైలో జరుగుతోంది.

 

 
 
 
Related News

JournalistDiary