India / Entertainment
బ్యాక్ టు బాలీవుడ్
126 days ago

సౌత్ ఫిల్మ్ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి నార్త్ బ్యూటీ రకుల్‌ప్రీత్... ఇప్పుడు బాలీవుడ్ మీద ఫొకస్ పెట్టింది. కెరీర్ స్టార్టింగ్‌లో
‘యారియా’ మూవీ చేసింది అక్కడ. ఆ చిత్రంలో లిప్‌లాప్ సీన్లు చేసి గ్లామర్‌గా కనిపించడానికి సై అన్నా ఈ బ్యూటీని
బాలీవుడ్ పట్టించుకోలేదు. దాంతో సౌత్‌కి మకాం మార్చి టాప్ హీరోయిన్‌గా మారిపోయింది.

 

ఇక తెలుగు, తమిళంలో స్టార్ హీరోల పక్కన సినిమాలు చేస్తూ భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటోంది ఈ సుందరి. ఈసారి
అక్కడ సక్సెస్ కావడానికి పక్కా ప్లాన్ చేసింది. ఎ వెడ్నస్ డే, స్పెషల్ చబ్బీస్, బేబీ లాంటి హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ నీరజ్ పాండే కొత్త ప్రాజెక్టులో ఆఫర్ పట్టేసింది రకుల్. ఈ ప్రాజెక్ట్ తోనైనా బాలీవుడ్ లో సెటిలవుతుందో లేదో చూడాలి.

 

Read Also

 
Related News
JournalistDiary