AP and TS / Entertainment
వీకెండ్ కలెక్షన్లు
10:15 AM on 22nd September, 2014

మహేష్‌బాబు నటించిన ‘ఆగడు’ కలెక్షన్లపై కన్ఫ్యూజన్ నెలకొంది. ఈ మూవీ వీకెండ్ వసూళ్లపై వెబ్‌ మీడియాలో రకరకాలుగా వార్తలు వెలువడుతున్నాయి. ఒకరు 35 కోట్లని, మరొకరు 25 కోట్ల రూపాయలు రాబట్టిందని ప్రచారం జరుగుతోంది. వీకెండ్ (మూడు రోజులకు కలిపి) దాదాపు 26 నుంచి 31 కోట్ల రూపాయల మధ్యలో వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఫస్ట్ డే 9 కోట్ల 75 లక్షలు వసూలు చేసిన ఈ మూవీ మిగిలిన రెండురోజులు ఇదే స్పీడ్ కంటిన్యూ అవుతుందని నిర్మాతలు భావించారు. 

అనుకున్నంతగా సినిమాపై టాక్ రాకపోవడంతో వసూళ్లు మందగించాయని ఫిల్మ్‌నగర్‌లో చెప్పుకుంటున్నారు. ఫస్ట్‌డే తెలంగాణ+ ఏపీ మార్కెట్ రూ.9 కోట్ల 75 లక్షలు. ఇతర రాష్ర్టాలు, ఓవర్సీస్ ఫస్ట్ డే 5 కోట్ల వరకు రాబట్టినట్టు తెలుస్తోంది. మిగతా రెండురోజుల్లో కలెక్షన్ల స్పీడ్ తగ్గిందని టాక్. ఈ వారం గడిస్తే లాభమో నష్టమో తెలుస్తుందని డిస్ర్టిబ్యూటర్లు చెబుతున్నారు.

 
 
 

Related News