AP and TS / Entertainment
‘రెమో’ మూవీ రివ్యూ
330 days ago

కోలీవుడ్‌లో హిట్టయిన మూవీ ‘రెమో’ ఇదే పేరుతో తెలుగులో రిలీజ్ చేశారు. శుక్రవారం థియేటర్స్‌కి వచ్చిన ఈ చిత్రంలో  శివకార్తికేయన్- కీర్తి సురేష్ జంటగా నటించారు. తమిళంలో మాదిరిగానే కేవలం వినోదాన్ని నమ్ముకొన్న ఈ కమర్షియల్‌ చిత్రం, తెలుగులో ఆకట్టుకుందా? ఒక్కసారి రివ్యూలోకి వెళ్దాం... 

స్టోరీ..

సినిమా స్టార్‌ కావాలని కలలు కంటాడు శివ (శివ కార్తికేయన్‌). అనుకోకుండా కావ్య(కీర్తి సురేష్‌)ని చూసి ఇష్టపడతాడు. ఇక అక్కడి నుంచి ఆమెని ఫాలో అవుతాడు. లవ్ గురించి చెప్పే టైంలో కావ్యకు సంబంధించిన ఓ విషయం శివకి తెలుస్తుంది. ఇక తప్పని పరిస్థితుల్లో నర్సు వేషం వేస్తాడు. ఆ గెటప్‌లో కావ్యని రెమోగా ఇంట్రడ్యూస్ చేసుకొంటాడు. రెమో అమ్మాయేనని భావించి మరింత చనువుగా ఉంటుంది కావ్య. తన ఆసుపత్రిలో నర్సుగా ఉద్యోగం కూడా ఇప్పిస్తుంది కూడా!  ఆ తర్వాత ఏమైంది? శివ చివరి తన ప్రేమని బయటపెట్టాడా? అన్నది తెరపై చూడాలి. 

విశ్లేషణ... 

చిత్రం భళారే విచిత్రం, మేడమ్, భామనే సత్యభామనే తరహా వచ్చింది ‘రెమో’. ఈ జోనర్‌లో ఎన్నిసార్లు చెప్పినా కొత్తగానే వుంటుంది. వినోదం పండించడానికి బాగుంటుంది. తమిళంలో నటుడిగా పేరు తెచ్చుకున్న శివకార్తికేయన్‌.. తెలుగులో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఒకవైపు శివ, మరోవైపు రెమో.. ఈ రెండు క్యారెక్టర్లలో ఇమిడిపోయాడు. మధురై యాసతో సాగే డైలాగ్స్ బాగున్నాయి. వాటిని తెలుగులో సరిగా ట్రాన్స్‌లేట్ చేయలేదు. దీనివల్ల కామెడీ తగ్గినట్టు వుంటుంది. ఇక లేడీ గెటప్‌లో చెప్పనక్కర్లేదు. కాసింత ఓవర్‌ అని చెప్పవచ్చు. కీర్తి సురేష్‌‌ బ్యూటీఫుల్‌గా వుంది. తెలుగు నటులకంటే తమిళంలో నటీనటులే ఎక్కువ. ప్రేమ పొందడానికి హీరో చేసే డిఫరెంట్‌గా వుంటాయి. ఫస్టాఫ్ వరకు కామెడీ సాగుతుంది. పాటలు, ఫైట్స్ ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకున్నాయి. సెకండాఫ్‌ స్టోరీలో వేగం తగ్గింది. ఇంకా చెప్పాంటే కొంతమంది బ్యూటీలు గెస్టుగా కనిపించడం అదనపు ఎట్రాక్షన్. ఇక క్లైమాక్స్‌లో డైరెక్టర్ కన్నన్.. సరైన ముగింపు ఇచ్చాడు. టెక్నికల్ పరంగా ఓకే.. అనిరుథ్‌ సంగీతం, పీసీ శ్రీరామ్‌ కెమెరా వర్క్ పర్వాలేదు. కాకపోతే అక్కడక్కడా కత్తెరలు పడితే బాగుండేది. ఏదో ఆశించివెళ్తే కష్టం.. హ్యాపీగా నవ్వుతూ బయటకురావచ్చు. మొత్తానికి కామెడీ ఎంటర్‌టైనర్ ఫిల్మ్. 

 

Read Also

 
Related News
JournalistDiary