India / Entertainment
ఫస్ట్‌క్లాస్‌లో పాసైన హీరోయిన్
15 days ago

మొదటి మూవీతో హీరోయిన్‌‌గా గుర్తింపు తెచ్చుకున్న మరాఠీ నటి రింకూ రాజ్‌గురు ఫస్ట్‌ క్లాస్‌లో పాసైంది. ఈ విషయాన్ని ఆమె తెలిపింది. మహారాష్ట్ర.. షోలాపూర్‌ జిల్లాలోని అక్లుంజ్‌ పట్టణానికి చెందిన రింకూ, ఆ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పదోతరగతి ఫలితాల్లో 66.40 శాతం మార్కులతో పాసైంది.

 

హిందీ సబ్జెక్టులో అత్యధికంగా 87 మార్కులు రాగా, మాతృభాష మరాఠీలో 83 మార్కులు వచ్చాయి. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ- 42, మ్యాథ్స్‌- 48, సోషల్‌- 50, ఇంగ్లీష్‌- 59 మార్కులొచ్చాయి. జజియామాతా కన్యా ప్రశాల పాఠశాలలో చదివిన ఈమె, సినిమాలో ఛాన్స్ రావడంతో పాఠశాలకు వెళ్లలేక ప్రైవేట్‌గా పరీక్ష రాసి ఫస్ట్ క్లాస్‌లో పాసైంది. ప్రాంతీయ సినిమా ‘సైరత్’ విడుదలైన నుంచి రింకూ పేరు మార్మోగింది. మరాఠీ సినీ చరిత్రలో 100 కోట్ల వసూళ్లు సాధించిన తొలి మూవీగా ‘సైరత్‌’ గుర్తింపు పొందిన విషయం తెల్సిందే!

 

 
 
 
Related News

JournalistDiary