India / General
అలాగైతే.. దేశం విడిచి పోతా
130 days ago

తమిళ హీరో శింబు మళ్లీ వార్తల్లోకి వచ్చేశాడు. ఈసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. జల్లికట్టు నిర్వహణ కుదరదంటే తాను దేశాన్ని విడిచిపోతానంటూ వ్యాఖ్యానించాడు. అనాదిగా వస్తున్న తమ సంప్రదాయం ఉనికినే కోల్పోయే పరిస్థితి ఏర్పడిందంటూ ఆవేదన వ్యక్తంచేశాడు.

దీనిపై  విడివిడిగా పోరాటం చేస్తే ఫలితం ఉండదని, అందురూ ఒకేతాటి మీదకు రావాలని పిలుపునిచ్చాడు. తమ సంప్రదాయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, జల్లికట్టు కోసం తన ఇంటి ముందు పది నిమిషాలు మౌనం పాటిస్తానని మనసులోని మాటను బయటపెట్టాడు. 

 

 
 
 
Related News
JournalistDiary