AP / Politics
జగన్ ప్రతిపక్షనేత కావడం మా అదృష్ణం
9 days ago

జగన్ వచ్చేనెల రెండోతేదీనుంచి చేపట్టబోతోన్న పాత్రయాత్రపై టీడీపీ నేతల విమర్శలు గుప్పిస్తున్నారు. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, ఆపార్టీ సీనియర్ నేత ఆదినారాయణరెడ్డి ఈ అంశంపై సెటైర్లు వేశారు. జగన్ ప్రతిపక్షనేతగా ఉండటం తమ అదృష్టమని ఎన్నటికీ జగన్ సీఎం కాలేరని కేఈ చెప్పుకొచ్చారు. పాదయాత్ర వల్ల జనాలకు ఒరిగేదేమీ లేదని, త్వరలోనే వైసీపీ కనుమరుగు కావడం ఖాయమని ఆయన అన్నారు.

జగన్ 3 వేలు కాదు 30 వేల కి.మీ. నడిచినా ఉపయోగం లేదని తేల్చి చెప్పారు ఆదినారాయణ రెడ్డి. వైసీపీ అధినేత జగన్ పాదయాత్రపై మంత్రి ఆదినారాయణరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కాళ్ల నొప్పులు తెచ్చుకునేందుకు జగన్ పాదయాత్రను చేపట్టబోతున్నారన్నారు. కాగా, నవంబర్ 2వ తేదీ నుంచి చేపట్టబోతోన్న జగన్ పాదయాత్ర ఇడుపులపాయ నుంచి చిత్తూరు జిల్లా మీదుగా శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు యాత్ర కొనసాగనుంది. ఆరు నెలల పాటు సాగే ఈ యాత్రలో జగన్ దాదాపు 3వేల కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు.

 

Read Also

 
Related News
JournalistDiary