AP / Politics
శిరీషకు సిక్కోలు, రవిచంద్రకు నెల్లూరు
10 days ago

ఎట్టకేలకు ఏపీలో టీడీపీ జిల్లా అధ్యక్షుల ఎంపిక పూర్తయింది. కొన్నిరోజుల నుంచి కసరత్తు చేసిన అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆదివారం జాబితాను ఫైనల్ చేశారు. ఐవీఆర్‌ఎస్‌ సర్వే ద్వారా జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. చాలాజిల్లాల్లో కొత్తగా వచ్చినవాళ్లకి బాధ్యతలు అప్పగించడంపై సీనియర్లు కాసింత సీరియస్‌గా వున్నట్లు వా ర్తలు వెలువడుతున్నాయి. ఎంపికైన నేతల్లో చాలామంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలున్నారు. ఇక తెలంగాణ విషయానికొస్తే.. జిల్లాల అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ జరగనుందని సమాచారం. దీంతో చాలామంది ఆశలు పెట్టుకున్నారు. 

జిల్లా అధ్యక్షుల వివరాలు..
శ్రీకాకుళం            - గౌతు శిరీష
విజయనగరం    -మహంతి చిన్నంనాయుడు
విశాఖ నగరం    -వాసుపల్లి గణేశ్‌కుమార్‌
విశాఖ రూరల్      - పంచకర్ల రమేశ్‌బాబు
తూర్పుగోదావరి - నామాన రాంబాబు
పశ్చిమగోదావరి - తోట సీతారామలక్ష్మి
కృష్ణా జిల్లా             -బచ్చుల అర్జునుడు
గుంటూరు            - జీవీ ఆంజనేయులు
ప్రకాశం                  - దామచర్ల జనార్దన్‌
నెల్లూరు                - బీద రవిచంద్ర
చిత్తూరు                 - పులివర్తి నాని
కడప                        -  శ్రీనివాసులు రెడ్డి
కర్నూలు                - సోమిశెట్టి వెంకటేశ్వర్లు
అనంతపురం         - బీకే పార్థసారథి

 

 
 
 
Related News

JournalistDiary