India / Crime
వెంకయ్యనాయుడు అరెస్ట్
124 days ago

విశాఖపట్టణం గాజువాక సబ్ రిజిస్ట్రార్ దొడ్డపనేని వెంకయ్య నాయుడు అరెస్ట్ అయ్యారు. విశాఖలోని వెంకయ్యనాయుడు నివాసం ‘శ్రీ గోవిందం భవనం’తో పాటు, తిరుపతిలో కూడా సోదాలు జరిగాయి. ఇప్పటి వరకు రూ.20 కోట్లకు పైగా అక్రమ ఆస్తులను గుర్తించినట్టు సమాచరం. విశాఖలో 15 ఇళ్ల స్థలాలు, నర్వలో 4 ఎకరాల భూమి ఉన్నట్టు తేలింది.

వెంకయ్యనాయుడు నివాసంలో రెండు కార్లు, బైక్, 1.75 కిలోల బంగారం,1.35 కిలోల వెండి, రూ.20 లక్షల విలువైన వస్తువులు, రూ.42 లక్షల నగదును అధికారులు సీజ్ చేశారు. మరో రూ.5 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్,రూ. 5 లక్షల పత్రాల కూడా గుర్తించారు. తన మామ పేరుతో తిరుపతిలో ఐదు అంతస్తుల లాడ్జి, తోడల్లుడు పేరుతో తుంగ్లాంలో ఓ భవనం తోపాటు మరిన్ని ఆస్తులు వెలుగులోకి వస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో ఒకసారి ఇలా ఏసీబీకి చిక్కినా వెంకయ్యనాయుడు తన పంథా మార్చుకోకపోవడం గమనార్హం. 2011 జనవరిలో మధురవాడ సబ్ రిజిస్ట్రార్ ఉన్న సమయంలో ఏసీబీ తనిఖీల నిర్వహించి అక్రమాస్తుల కేసులో వెంకయ్యనాయుడిని అరెస్టు చేసింది. 

 

Read Also

 
Related News
JournalistDiary