AP and TS / Entertainment
అనసూయ న్యూ యాంగిల్
222 days ago

ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతోన్న బాలయ్య వందో సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’తో ‘జబర్దస్త్’ బ్యూటీ అనసూయ తనలోని న్యూ టాలెంట్ చూపించబోతోందట. ఇప్పటివరకు బుల్లితెర,  వెండితెర మీద నటిగానే తెలిసిన అనసూయ.. ‘శాతకర్ణి’ సినిమాతో చూపించబోయే న్యూ టాలెంట్ ఏంటనేది ఇంట్రెస్టింగ్ న్యూస్ అయ్యింది. ఆ మూవీలో ఆమె ఓ ఇంపార్టెంట్ రోల్‌కి డబ్బింగ్ చెప్పిందట.

శాతకర్ణి సినిమాలో ఇండో-గ్రీక్ యోధురాలిగా ఓ ఇంపార్టెంట్ రోల్ చేసిన డచ్ మోడల్ ఫరా కరిమికి అనసూయ తన వాయిస్ ఇచ్చిందట. మూవీలో ఈ క్యారెక్టర్ చిన్నదే అయినా.. కథను మలుపు తిప్పేంత ముఖ్యమైనదట.అందుకే.. ఈ రోల్‌కి అనసూయతో డబ్బింగ్ చెప్పించాడట క్రిష్. ఈ విధంగా అయినా బాలయ్య ల్యాండ్ మార్క్ మూవీలో తనూ పార్ట్ అయినందుకు ఆనందంగా వుంది అనసూయ. అయితే.. అనసూయ డబ్బింగ్ చెప్పడం ఇదే ఫస్ట్ టైం కాదు. ఇంతకుముందు క్రిష్ డైరెక్ట్ చేసిన ‘వేదం’ మూవీలో హీరోయిన్ దీక్షాసేథ్‌కి ఆ యాంకరమ్మే వాయిస్ ఇవ్వడం కొసమెరుపు.

 
 
Related News