AP and TS / Entertainment
అనుపమ టాలెంట్ అలాంటిది
222 days ago

‘అ..ఆ’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది అనుపమ పరమేశ్వరన్. ఆ మూవీలో సమంత సమానంగా పాపులర్ అయ్యింది ఆ అమ్మడు. ఆ తరువాత ‘ప్రేమమ్’ తెలుగు రీమేక్‌లో నటించిన ఆ భామకి తెలుగులో అభిమానులు పెరిగిపోయారు. తన క్యూట్ లుక్స్‌తో యూత్‌లో మంచి ఫాలోయింగ్ వచ్చేసింది. అలాగే క్రేజీ ఆఫర్లు కూడా ఆమె ముందు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే సుకుమార్-రాం చరణ్ క్రేజీ కాంబో మూవీలో ఓ హీరోయిన్‌గా అనుపమ ఫిక్స్ అయ్యింది. 

ఇప్పుడు న్యాచురల్ స్టార్ నానితో జతకట్టే ఆఫర్ కూడా కొట్టేసింది. వేణు శ్రీరాం డైరెక్షన్‌లో దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న న్యూ మూవీలో కథానాయికగా అనుపమని ఫిక్స్ చేసారట. ఇప్పటికే దిల్ రాజు ప్రొడక్షన్‌లో శర్వానంద్ హీరోగా తెరకెక్కిన్న ‘శతమానం భవతి’ మూవీలో హీరోయిన్‌గా చేసింది. అప్పుడే అనుపమ తన టాలెంట్‌తో దిల్ రాజు దగ్గర మంచి మార్కులు కొట్టేసింది. అందుకే.. అతను మళ్ళీ ఆ భామకి తన ప్రొడక్షన్‌లో హీరోయిన్‌గా అవకాశం ఇచ్చాడని ఇన్‌సైడ్ టాక్.

 
 
Related News