AP and TS / Entertainment
బ్రహ్మీ ఈజ్ బ్యాకేనా..
283 days ago

వరల్డ్ వైడ్ గా మెగాస్టార్ చిరంజీవి ల్యాండ్ మార్క్ మూవీ ' ఖైదీ నం.150 ' థియేటర్లలో సందడి చేసింది. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ మెగా అభిమానులు ఖైదీ మూవీతో  ఖుషీ అయ్యారు. అయితే ఖైదీ మూవీతో టాలీవుడ్ కామెడీ కింగ్ బ్రహ్మానందం కూడా బౌంస్ బ్యాక్ అవుతాడని న్యూస్ హల్చల్ చేసింది. ఈ మధ్య బ్రహ్మానందం కామెడీతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో ఫెయిల్ అవుతున్నాడనే టాక్ వచ్చింది.

టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన యంగ్ కమెడియన్ల హవాకి బ్రహ్మానందం క్రేజ్ తగ్గింది. అయితే ఖైదీ సినిమాతో బ్రహ్మానందం మళ్ళీ ఫాంలోకి రాబోతున్నాడని..డైరెక్టర్ వినాయక్ స్పెషల్ కేర్ తీసుకొని కామెడీ ట్రాక్ తెరకెక్కించాడని..ఖైదీలో బ్రహ్మీ కామెడీ ఇరగదీసేసాడని ఫీలర్లు వచ్చాయి.అయితే ఖైదీ రిలీజ్ తరువాత అందరి అటెంషన్ మెగాస్టార్ చిరంజీవి మీదే పడింది. బ్రహ్మీ గురించి పట్టించుకున్న వాళ్ళే లేకుండాపోయారు. దాంతో బ్రహ్మీ ఈస్ బ్యాకేనా అంటూ ఫిల్మ్ సర్కిల్స్ లో గుసగుసలు వినబడుతున్నాయి .

 

Read Also

 
Related News
JournalistDiary