AP and TS / Entertainment
జనసేన జెండా.. చిర్రెత్తిన చిరు
44 days ago

మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెం.150’ మూవీ ప్రీ-రిలీజ్ ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ అభిమాని ఒకరు చేసిన హంగామా చిరజీవికి చిర్రెత్తించింది. కాస్త కోపాన్ని కూడా కలిగించింది. వేలాదిమంది పవన్ ఫ్యాన్స్ హాజరైన ఈ ఈవెంట్‌లో చిరంజీవి మాట్లాడుతున్నప్పుడు.. స్టేజీకి దగ్గరలో ఉన్న ఓ అభిమాని తన చేతిలో జనసేన జెండా పట్టుకుని ఆయనను ఇబ్బంది పెట్టాడు. 

ఆ జెండాను కిందికి దించాల్సిందిగా చిరు కోరినా.. ఆ ఫ్యాన్ వినకుండా మరింత రెచ్చిపోయి కేకలు పెట్టాడు. చిరంజీవి మళ్ళీ హెచ్చరించినా ఫలితం లేకపోయింది. చివరకు చేసేదేమీ లేక చిరు తన స్పీచ్ కంటిన్యూ చేసి ముగించారు. ఈ ఈవెంట్‌లో పవన్ అభిమానులు చాలామంది జనసేన పార్టీ జెండాలతో రావడం విశేషం.

 

 
 
 
Related News

JournalistDiary