India / Entertainment
జయమ్ము నిశ్చయమ్మురా రివ్యూ
179 days ago

కమెడియన్, నటుడు శ్రీనివాస రెడ్డి హీరోగా, పూర్ణ హీరోయిన్ గా శుక్రవారం విడుదలైంది జయమ్ము నిశ్చయమ్మురా చిత్రం. గతంలోని ఓ పాటనే టైటిల్ గా తీసుకుని దర్శకుడు శివరాజు కనుమూరి తీసిన ఈ చిత్రం రివ్యూలోకి వెళ్దాం. 

సర్వమంగళం (శ్రీనివాస రెడ్డి) అనే నిరుద్యోగి కరీం నగర్ లోని సదాశివపల్లె లో నివసిస్తుంటాడు. ఇతనికి మూఢ నమ్మకాల పిచ్చి ఎక్కువ. దాన్ని, ఇతని అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని పితా (జీవా) అనే వ్యక్తి తరచూ బోల్తా కొట్టిస్తుంటాడు. సర్వ మంగళానికి కాకినాడ మున్సిపల్ ఆఫీసులో ఉద్యోగం వస్తుంది. అక్కడ రాణి (పూర్ణ) అనే యువతితో ప్రేమలో పడతాడు. మీ-సేవ ఆఫీసులో పని చేసే రాణి మరెవరినో ప్రేమిస్తోందని అతనికి తెలుస్తుంది. ఈ ప్రేమ యుద్ధంలో సర్వమంగళం గెలుస్తాడా..? జెసి (రవివర్మ) కి, అతనికి మధ్య ఎందుకు గొడవ వస్తుంది..? ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

ప్పోర్తి ఎంటర్ టైనర్ గా జయమ్ము నిశ్చయమ్మురా చిత్రాన్ని తీర్చి దిద్దాడు శివరాజ్ కనుమూరి. పితా పాత్రలో జీవా, అడపా ప్రసాద్ రోల్ లో కృష్ణ భగవాన్ ఓకె. పోసాని, జోగి బ్రదర్స్ క్యారెక్టర్స్ బావున్నాయి. శ్రీనివాస రెడ్డి తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు.

అక్కడక్కడా చిత్రం నిడివి ఎక్కువగా ఉంది. సెకండాఫ్ సాగదీశారు. ఓ పది నిముషాలు ఎడిట్ చేయాల్సింది. మొత్తం మీద ఇదో వినోదాత్మక మూవీ.

 

 
 
 
Related News
JournalistDiary