Telangana / Crime
హైదరాబాద్ శివార్లలో ఓ వ్యాపారిపై కాల్పులు
1075 days ago

హైదరాబాద్ శివార్లలో కాల్పుల మోత కలకలం రేపింది. రాజేంద్రనగర్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారిని టార్గెట్ చేసిన గుర్తు తెలియని వ్యక్తులు రెండురౌండ్లు కాల్పులు జరిపారు. తృటిలో కాల్పుల నుంచి తప్పించుకున్న వ్యాపారి నేరుగా పోలీసుల్ని ఆశ్రయించాడు. కాల్పులకు కారణం భూవివాదాలా..? ఆర్థిక లావాదేవీలా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఇటు ఈ ఘటన స్థానికుల్ని హడలెత్తించింది.

టీఎస్ 13 ఈఏ 8116 నెంబర్ వున్న ఇన్నోవా కారులో బయలుదేరిన వ్యాపారి షాబుద్దీన్‌ను కొంతమంది టార్గెట్ చేశారు. ఉదయం పనిమీద ఏజీ కాలనీ సమీపంలోకి రాగానే యమహా బైక్‌పై వచ్చిన దుండగులు తుపాకులతో కాల్పులు జరిపి, రాడ్‌తో ఇన్నోవా అద్దాలు ధ్వంసం చేశారు. ఊహించని ఘటనతో షాకైన వ్యాపారి తప్పించుకున్నాడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు స్పాట్‌కు చేరుకుని వివరాలు సేకరించారు. కారును స్వాధీనం చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు.

 

Read Also

 
Related News
JournalistDiary