India / Entertainment
మనలో ఒకడు మూవీ రివ్యూ
77 days ago

సినిమా పేరు: మనలో ఒకడు

రిలీజ్ డేట్ : 04-11-2016

డైరెక్షన్, మ్యూజిక్ : ఆర్పీ పట్నాయక్

ప్రొడ్యూసర్స్: గురజాల జగన్ మోహన్

నటీనటులు:  ఆర్పీ పట్నాయక్, అనిత తదితరులు

పలు మంచి సినిమాలకు మ్యూజిక్ అందించి తనకంటూ ఓ మార్క్ సంపాదించుకున్న ఆర్పీ పట్నాయక్ తర్వాత నటుడుగా మారి లైమ్ లైట్ లోంచి డిమ్ లైట్ లోకి టర్న్ అయ్యాడు.  చాన్నాళ్ల తర్వాత ఆర్పీ డైరెక్ట్ చేస్తూ నటించిన సినిమా 'మనలో ఒకడు' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి సందేశానివ్వాలని ఆర్పీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. 

కథ :  కృష్ణమూర్తి(ఆర్పీ పట్నాయక్) ఒక హానెస్ట్ ప్రొఫొసర్. అతని భార్య హంసానందిని(అనిత)తో కలిసి చాలా సింపుల్ లైఫ్ లీడ్ చేస్తుంటాడు. అయితే, ఒక రోజు ఉన్నట్టుండి టీవీలో తన ఫొటో కనిపిస్తుంది. అంతేకాదు, ఈ ప్రొఫెసర్ ఎన్నో నీచమైన పనులకు పాల్పడ్డాడన్న స్టోరీ చూసి షాక్ తిన్న కృష్ణమూర్తి అతని నిర్ధోషిత్వాన్ని సదరు ఛానల్ లో ప్రూవ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో అతను మరిన్ని చిక్కుల్లో పడతాడు. ఈ నేపథ్యంలో కృష్ణమూర్తి ఎలాంటి కష్టాలు అనుభవించాడు.. దీనంతటికీ కారణమేంటి? వీటినుంచి ఎలా బయటపడ్డాడు అనేదే కథ.

విశ్లేషణ :  మీడియా అలసత్వం ఒక సాధారణ వ్యక్తికి ఎన్ని కష్టాలు తెచ్చిపెట్టిందో ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు ఆర్పీ పట్నాయక్. కథనాన్ని ఆసక్తికలిగేలా తెరకెక్కించాలనే క్రమంలో యాక్టర్ గా పెద్దగా మార్కులు సంపాదించలేకపోయాడనిపిస్తుంది. హీరోయిన్ గా నటించిన అనిత చాలాకాలం తర్వాత ఓ మంచి రోల్ లో కనిపించింది. ఎమోషనల్ సీన్స్‌లో ఆర్పీ పట్నాయక్‌కు ఆమె సపోర్ట్ బావుంది. మీడియా అధిపతిగా సాయికుమార్ నటన సూపర్.

 ఇక యంగ్ యాక్ట్రస్ శ్రీముఖి పాత్ర చిన్నదే అయినా ఆకట్టుకుంది. ఫస్టాఫ్‌లో సన్నివేశాలు కొంత ఆసక్తి కరంగానే సాగినప్పటికీ సెకండాఫ్ లో మాత్రం ఆర్పీ పట్టుకోల్పోయినట్టు కనిపిస్తుంది. ఫస్టాఫ్ లో ప్రేక్షకుడిలో  కనిపించిన ఆసక్తి సెకండాఫ్ నడిచే కొద్దీ మాయమైపోతుంది. కథలో పట్టుతగ్గి చివరికి సాగతీదలా మారి ప్రేక్షకుడికి విసుగు పుట్టిస్తుంది. జయప్రకాష్ రెడ్డితో సన్నివేశాలు, ఐటెం సాంగ్ ఆడియన్స్ కు విసుగుపుట్టిస్తాయి.  అయితే, సినిమాలో టెక్నికల్ వాల్యూస్ మాత్రం ఉన్నాయనిపిస్తుంది. ఆర్పీ మ్యూజిక్ ఓ మోస్తరుగా సాగింది. రెండు సాంగ్స్ ఎడిటింగ్ లో తీసేస్తే బావుండేదనేలా సాగాయి. ఆర్పీ స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ ఓకే కాని, సెకండాఫ్ మాత్రం చిరాకురప్పించేలా తయారైంది. మెసేజ్ ఓరియంటేషన్ తో తెరకెక్కిన సినిమా ఇది. 

 
 
 
Related News

JournalistDiary