AP and TS / Entertainment
యంగ్ హీరోల డైరెక్షన్ డ్రీమ్స్
170 days ago

ప్రస్తుతం టాలీవుడ్‌లో వున్న యంగ్ హీరోల్లో కొందరికి మల్టీ టాలెంటెడ్ ఫీచర్ కూడా వుంది. కేవలం యాక్టర్‌గానే కాకుండా అవకాశం దొరికితే మిగతా క్రాఫ్ట్స్‌లో కూడా తమ టాలెంట్ చూపించడానికి రెడీగా వున్నారు. టాలీవుడ్ యంగ్ హీరోలు మంచు మనోజ్, అల్లరి నరేష్, రాజ్ తరుణ్ త్వరలో డైరెక్షన్ చేసే ప్లాన్‌లో వున్నారు. మంచు మనోజ్ ఇప్పటికే తన సినిమాల్లో యాక్షన్ కొరియాగ్రఫీ చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు డైరెక్టర్‌గా కూడా మారి ఓ మూవీ చేస్తాడట. అదీ అందరూ కొత్త వాళ్ళతో చేస్తాడట.

అలాగే అల్లరి నరేష్ కూడా తన డైరెక్షన్‌లో చేయబోయే మూవీ కోసం స్టోరీ రెడీ చేస్తున్నాడట. బేసిగ్గా కామెడీ హీరో అయినా నరేష్‌కి ‘బృందావన్ కాలనీ’లాంటి బరువైన లవ్ స్టోరీలంటే ఇష్టమట. మరి ఈ అల్లరోడు కామెడీని తీస్తాడా లేక లవ్ స్టోరీ తీస్తాడా అనేది ఆసక్తి రేపుతోంది. మనోజ్, నరేష్ తరువాత ఈ లిస్ట్‌లో నేనూ వున్నానంటున్నాడు రాజ్ తరుణ్. ఇతను హీరో కాకముందు షార్ట్ ఫిల్మ్స్ డైరెక్ట్ చేసాడు. ఆ అనుభవంతో డైరెక్టర్‌గా మారడానికి స్టోరీలు రెడీ చేసాడట. అందులో ఒకటి అల్లు అర్జున్ కోసం మరొకటి సునీల్ కోసం రెడీ చేసాడట. అయితే.. ఇప్పటికే రాజ్ తరుణ్ డైరెక్షన్‌లో చేయడానికి సునీల్ ఓకే అన్నాడని ఇన్‌సైడ్ టాక్. సో.. ఈ ఇయర్‌లో ఈ యంగ్ హీరోల డైరెక్షన్ డ్రీమ్స్ నిజమయ్యే అవకాశం వుందన్నమాట.

 

 
 
 
Related News

JournalistDiary