AP and TS / Entertainment
మెగాఫ్యామిలీ అప్‌సెట్..?
286 days ago

‘ఖైదీ నెం.150’ చిత్రం ప్రీ-రిలీజ్ ఫంక్షన్‌లో నాగబాబు చేసిన కామెంట్స్ పట్ల మెగాఫ్యామిలీ అప్‌సెట్ అయినట్లు తెలిసింది. ఈవెంట్ అంతా హ్యాపీగా సాగిపోతుండగా రాంగోపాల్ వర్మని, రైటర్ యండమూరి వీరేంద్రనాథ్‌ని నాగబాబు అనవసరంగా ముగ్గులోకి లాగి వివాదం సృష్టించారని, ఇది సముచితం కాదని మెగాఫ్యామిలీ భావిస్తోందని అంటున్నారు.

ఎప్పుడో యండమూరి ఓ స్కూల్ ఈవెంట్‌లో చరణ్ గురించి మాట్లాడగా.. దాన్ని ఇప్పుడు హైలైట్ చేయడమేమిటని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇక ఆ యూట్యూబ్ వీడియో దొరుకుతుందేమోనని శల్యపరీక్ష చేయడం ప్రారంభించారు. కాగా.. చిరు కూడా నాగబాబు కామెంట్స్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేశాడని వార్తలొస్తున్నాయి.

 

Read Also

 
Related News
JournalistDiary