AP and TS / Entertainment
‘నరుడా డోనరుడా’ మూవీ రివ్యూ
351 days ago

చాలాగ్యాప్ తర్వాత అక్కినేని వారసుడు సుమంత్ ‘నరుడా డోనరుడా’ మూవీతో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఈ హీరో నటించిన స‌త్యం, గౌరి, గోదావ‌రి, గోల్కొండ హైస్కూల్ వంటి చిత్రాలు బాక్సాఫీసు వద్ద హిట్‌కొట్టాయి. ఇప్పుడు ‘నరుడా డోనరుడా’తో ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చాడు.  బాలీవుడ్‌లో హిట్టయిన విక్కీడోనర్‌కు ఇది రీమేక్. హిందీ తరహాలోనే టాలీవుడ్‌లోనూ ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకుందా లేదా అన్నది తెలియాలంటే రివ్యూలోకి వెళ్దాం..

స్టోరీ...

విక్కీ (సుమంత్‌) మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన యువకుడు. విక్కీ చిన్నప్పుడే తండ్రి యుద్ధంలో మరణించడంతో త‌ల్లి బేబి(శ్రీల‌క్ష్మి) ఓ బ్యూటీ పార్లర్ న‌డుపుతూ కుటుంబాన్ని పోషిస్తూవుంటుంది. ఇదిలావుండగా ఓ బ్యాంకులో పనిచేసే ఆషిమా రాయ్‌ (పల్లవి సుభాష్‌) అనే అమ్మాయిని తొలిచూపులో ప్రేమిస్తాడు విక్కీ. తాను ఇదివరకే పెళ్లి- విడాకులు తీసుకున్న విషయాన్ని విక్కీకి ముందే చెబుతుంది. కానీ విక్కీ మాత్రం ఆషిమా దగ్గర ఓ నిజం దాస్తాడు.  అదేంటంటే... తాను స్పెర్మ్‌ డోనర్ అని.. సంతాన సాఫల్య కేంద్ర నిర్వాహకుడు ఆంజనేయులు (తనికెళ్ల భరణి) బలవంతం చేయడంతో తన వీర్యాన్ని దానం చేయడానికి ఒప్పుకొంటాడు. తన అవసరాలకు సరిపడినంత డబ్బు రావడంతో దానికి అలవాటు పడతాడు. పెళ్లి త‌ర్వాత ఆషిమాకు పిల్లలు పుట్టే అవ‌కాశం లేద‌నే నిజం తెలుస్తుంది. ఈ క్రమంలో ఆషిమా ఏం చేస్తుంది? విక్కీ గురించి అసలు నిజం ఆషిమాకు తెలుస్తుందా? లేదా? అన్నది తెరపై చూడాలి. 

విశ్లేషణ... 

బాలీవుడ్‌ మూవీని అందులో పాత్రలను మక్కీగా దించేశాడు డైరెక్టర్ మ‌ల్లిక్‌రామ్. విక్కీడోనర్ చూసిన వాళ్లకు ‘డోనరుడా’ కాపీ పేస్ట్‌ మాదిరిగానే ఉంటుంది. ముఖ్యంగా ఈ తరహా కాన్సెప్ట్‌ను తెలుగు ఆడియెన్స్‌కు న‌చ్చేలా చూపించ‌డంలో ఫెయిల్ అయ్యాడు. హిందీలో అనుక‌పూర్ చేసిన డాక్టరు రోల్‌కి నేషనల్ అవార్డు వచ్చింది. అలాంటి క్యారెక్టర్‌ని త‌నికెళ్ల భ‌ర‌ణి‌ని తీసుకుని స‌రిగా డిజైన్ చేయ‌లేక‌పోయాడు. వీర్యదానం కాన్సెప్ట్‌ని అర్థమయితే ఫస్టాఫ్ ఓకే.. కాకపోతేనే కొన్ని సన్నివేశాలు వచ్చినప్పుడు కాసింత ఇబ్బందిపడే విధంగా వుంటుంది. వీర్యదానం, విత్తనం వంటి మాటలే ఫస్టాఫ్ వినిపిస్తుంది. సెకండాఫ్‌లో ఏమోషనల్ సీన్స్ వున్నాయి. ఇక విక్కీ రోల్‌లో సుమంత్ యాక్టింగ్ బాగుంది. ఎమోష‌న‌ల్ సీన్స్‌‌ని బాగానే టచ్ చేశాడు. హీరోయిన్‌గా పల్లవి సుభాష్ ఓకే.. తన పరిధి మేరకు డీసెంట్ లుక్స్తో, కంటతడి పెట్టించేలా ఆకట్టుకుంది. సినిమా అంతా తానే నడిపించాడు సీనియర్ నటుడు తనికెళ్ల భరణి. హీరోని వీర్యదాతగా మార్చే డాక్టర్‌గా అద్భుతమైన కామెడీ పండించాడు. ప్రతీ సీన్‌లోనూ ఆయన మార్కు కనిపించింది. ఒకవిధంగా చెప్పాలంటే సినిమాకు మేజర్ ప్లస్ ఇదే! చాలా గ్యాప్ తర్వాత కమెడియన్ శ్రీలక్ష్మీ తల్లి పాత్రలో బాగుంది. హీరో- హీరోయిన్స్ మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు, పిల్లలు లేకుండా పేరెంట్స్ ప‌డే ఫీలింగ్స్‌ను హృద‌యానికి హ‌త్తుకునేలా చూపించలేకపోయాడు. పాటలు సరేసరి.. నేప‌థ్య సంగీతం అంతగా ఆక‌ట్టుకోలేదు. సినిమాటోగ్రఫీ బావుంది.. ఎడిటింగ్‌లో కత్తెరలు పడాల్సివుంది. పెద్దగా కామెడీ లేకపోవడం, ప్రేక్షకుల్ని సబ్జెక్ట్‌లోకి తీసుకెళ్లలేకపోయాడు డైరెక్టర్. వర్కవుట్ కాని డోనరుడిగా మిగిలిపోయాడు. 

 

Read Also

 
Related News
JournalistDiary