Telangana / Crime
టెక్కీని భర్తే హత్య చేశాడా ?
65 days ago

హైదరాబాద్ గచ్చీబౌలీలోని సుదర్శన్ నగర్‌‌లో ఓ టెక్కీ అనుమానాస్పద స్థితిలో మరణించింది. మాదాపూర్‌‌లోని బ్యాంక్ ఆఫ్ అమెరికాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని అయిన పద్మజ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే భర్తే తమ కూతురి మృతికి కారణమని ఆమె తలిదండ్రులు ఆరోపిస్తున్నారు. టెక్ మహీంద్ర లో పని చేస్తున్న గిరీష్ నరసింహకు, పద్మజకు గత ఏడాది ఏప్రిల్ లో వివాహం జరిగింది. కొంతకాలంగా వీరి మధ్య విభేదాలు తలెత్తాయని తెలిసింది. అదనపు కట్నం కోసం నరసింహ తమ కుమార్తెని వేధిస్తూ వచ్చాడని పద్మజ పేరెంట్స్ ఆరోపించారు. ఆదివారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో పద్మజ ఉరేసుకుని సూసైడ్ చేసుకుందని పోలీసులు తెలిపారు. ఆమె భర్త నరసింహను వారు అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.


అది ముమ్మాటికీ హత్యే

తమ కూతురిది ముమ్మాటికీ హత్యేనని అంటున్నారు పద్మజ తండ్రి నాగేశ్వర రావు. ప్రతి ఆదివారం పద్మజ తమ ఇంటికి వచ్చేదని, అయితే ఈనెల 18 వ తేదీ సాయంత్రం ఆమె భర్త నరసింహ తమకు ఫోన్ చేసి పద్మజ ముక్కు, చెవుల నుంచి రక్తం వస్తోందని, ఆసుపత్రికి తీసుకువెళ్తున్నామని చెప్పాడన్నారు. తాము ఆసుపత్రికి వెళ్లేసరికి పద్మజను ఐసీయూలో ఉంచారని, కొద్దిసేపటికి ఆమె మృతి చెందినట్టు డాక్టర్లు తెలిపారని ఆయన అన్నారు. పద్మజ ముఖం, శరీరంపై గాయాలున్నాయని, తమ కుమార్తెను నరసింహ విపరీతంగా వేధించేవాడని ఆయన వాపోయారు.

 
 
 

Read Also

 
Related News
JournalistDiary