AP and TS / Entertainment
వర్మ.. ‘రౌడీ నెంబర్ 150’
43 days ago

ట్విటర్ బాబుగా మారిన వర్మ.. మరోసారి తనదైన స్టైల్‌లో రెచ్చిపోయాడు. భగవద్గీతను, డామన్‌ వెయాన్స్‌, ఫ్రాంక్లిన్‌ ఫోర్‌ల కొటేషన్లను పేర్కొంటూ.. తన ఫీల్ ఏమిటో చూపాడు. ‘అద్దాల మేడలో ఉండే వాళ్లు ఇతరులపై రాళ్లు వేయకూడదు-భగవద్గీత’ అంటూనే.. డామన్‌ వెయాన్స్‌, ఫ్రాంక్లిన్‌ ఫోర్‌ల సందేశాలను గుర్తుకు తెచ్చాడు. వీటితోపాటు ‘రౌడీ నంబర్‌ 150’ అంటూ స్టీల్‌ గ్లాస్‌ను కంటికి అడ్డంగా పెట్టుకుని దిగిన ఫొటోను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకున్నాడు.

‘చిరంజీవిగారి అభిమానులకు నా క్షమాపణలు. అందుకు కారణం నాగబాబు. ఆయన తరపున కూడా నేనే క్షమాపణలు చెబుతున్నా. దేవుడు చిరంజీవిగారి కుటుంబానికి ఎన్నో పాజిటివ్స్ ఇచ్చాడు. పవన్‌, చరణ్‌, సాయిధరమ్‌ తేజ్‌, వరుణ్‌, బన్నీ వాటన్నింటినీ నాగబాబుగారితో బ్యాలెన్స్‌ చేశాడు’ అంటూ మరో ట్వీట్‌లో వ్యాఖ్యానించారు.

 

 
 
 
Related News

JournalistDiary