AP / Entertainment
ఆర్ధిక ఇబ్బందులు వేధిస్తున్నాయా..?
1108 days ago

పవన్ కళ్యాణ్ కొత్త సినిమా అత్తారింటికి దారేది ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తో్న్న ఆయన అభిమానులకు ఇది కొంచెం పిడుగులాంటి వార్తే. అత్తారింటికి ఆలస్యం వెనుక తెలంగాణ-సీమాంధ్రలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులే కారణం అని అందరూ అనుకుంటున్నారు. కానీ చాలామందికి తెలియని అసలు కారణం వేరే వుందని లేటెస్ట్ టాక్. తాజాగా వినిపిస్తోన్న ఫిలింనగర్ గాసిప్ ప్రకారం పవన్ సినిమా విడుదల అవకపోవడానికి అనిశ్చిత పరిస్థితులు ఒక కారణమైతే.. అసలు కారణం ఆర్ధిక ఇబ్బందులట. మొట్టమొదటిసారి సినిమా విడుదల తేదీ ప్రకటించడానికి ముందు సినిమా కొనడానికి ముందుకొచ్చిన బయ్యర్లు అడ్వాన్స్‌గా కొంత మొత్తమే చెల్లించారట. మిగిలిన ఎమౌంట్ విడుదల సమయంలో చెల్లిస్తామని అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. కానీ ఊహించని పరిస్థితుల్లో అనుకోని విధంగా సినిమా విడుదల వాయిదా పడటంతో ఇప్పుడు బయ్యర్లు కూడా మిగిలిన మొత్తాన్ని చెల్లించడానికి వెనకడుగేస్తున్నారని తెలుస్తోంది.

ఎటువంటి ఆటంకాలు లేకుండా సినిమా సక్సెస్‌'ఫుల్‌'గా నడిస్తే ఆ తర్వాత మొత్తం డబ్బులు ఇచ్చేస్తామని వాళ్లు మొండికేస్తున్నారని.., అందుకే సినిమా ఆలస్యం అవుతోందని చెప్పుకుంటున్నారు. అలా కాదని ముందే సినిమాని వాళ్ల చేతుల్లో పెట్టాలంటే నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్‌కి కూడా ఎక్కడో చిన్న టెన్షన్. అసలే హై బడ్జెట్ మూవీ కదా అని ఆలోచనలో పడ్డారని ఆయన సన్నిహితులు చెప్పుకుంటున్నారు.ఈ వార్తల నేపధ్యంలో సినిమా అక్టోబర్ 2న విడుదల అవుతుందని యూనిట్ ప్రకటించినప్పటికీ ఫ్యాన్స్‌ని ఇంకా కొన్ని అనుమానాలు వేధిస్తున్నాయి. ఇదిలావుంటే 'పవన్ సినిమాని బయ్యర్లు వేధించడం ఏంటి వింత కాకపోతే... ఎలాగూ ఆయన సినిమా విడుదలైతే కలెక్షన్లతో కనక వర్షమే కురుస్తుందిగా' అని అభిమానులు అంటున్నారు.

 
 
 
Related News

Jyo achyutanand 308X300 banner